/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-62-4.jpg)
White Paper On AP Excise Policy: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సంద్భంగా వైసీపీ హయాంలో ఎక్సైజ్ శాఖలో జరిగిన అవకతవకలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) శ్వేతపత్రం విడుదల చేశారు. ఆయన మట్లాడుతూ..' ఐదు టాప్ బ్రాండ్ల కంపెనీలను రాష్ట్రం నుంచి తరిమేశారు. లోకల్ బ్రాండ్ల కంపెనీలు విపరీతంగా పెరిగాయి. భూంభూం పేరుతో రకరకాల బ్రాండ్లు తీసుకొచ్చారు. టాప్ బ్రాండ్ల కంపెనీలకు రూ.127 కోట్లు బిల్లులు పెండింగ్‌లో పెట్టి ఇబ్బందులు పెట్టారు. పారిపోయేలా చేసేందుకు బిల్లులు ఆపుతూ బెదిరించారు.
Also Read: మరోసారి భారీగా పెరిగిన టమాటా ధర.. కిలో ఎంతంటే!
డిజిటల్ చెల్లింపులు లేకుండా నగదు లావాదేవీలు చేశారు. ఐఎంఎఫ్‌ఎల్, బీర్ ద్వారా రూ.3,113 కోట్ల అక్రమ వసూళ్లు చేశారు. తెలంగాణ, ఏపీ వృద్ధిరేటు మధ్య వ్యత్యాసం రూ.18,800 కోట్లు. రిటైల్ షాపుల ద్వారా రూ.99,413 కోట్లు నగదు వసూలు చేశారు. 2023 వరకు ఎలాంటి డిజిటల్ పేమెంట్లు జరగలేదు. 2023-24లో కేవలం రూ.615 కోట్లు మాత్రమే డిజిటల్ పేమెంట్లు జరిగాయి. ఇష్టానుసారంగా మద్యం తయారీని అధీనంలోకి తీసుకున్నారని' చంద్రబాబు పేర్కొన్నారు.
Also Read: మరో రెండ్రోజుల్లో పారిస్ ఒలింపిక్స్.. బరిలోకి భారత్ నుంచి 14 ఏళ్ల బాలిక