Andhra Pradesh : పిఠాపురంలో టీడీపీ, జనసేన మధ్య విభేదాలు పిఠాపురం టీడీపీ, జనసేన మధ్య విభేదాలు తలెత్తాయి. ఒక మీటింగ్‌లో ఇరు పార్టీ కార్యకర్తలు కొట్టుకున్నారు. టీడీపీ తమను అస్సలు లెక్క చేయడం లేదని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. తమతో పొత్తు ఉన్నా మీటింగ్‌లకు పిలవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. By Manogna alamuru 27 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ వైజాగ్ New Update షేర్ చేయండి Pithapuram : ఎన్నికలు ఇంకా అవ్వకుండానే ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో టీడీపీ, జనసేన(Janasena) పార్టీల మధ్య పొత్తుకు బీటలు వారే పరిస్థితి కనిపిస్తోంది. నిన్నటికి నిన్న ఏ గొడవా లేదంటూనే ఇరు పార్టీలు వేరువేరుగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులను పర్కటించారు. చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) అభ్యర్ధులను అనౌన్స్ చేస్తే నేను చేయలేనా అంటూ జనసేనాని రెండు సీట్ల అభ్యర్ధులను ప్రకటించారు. ఇక ఈరోజు పిఠాపురంలో జరిగిన మీటింగ్‌లో టీడీపీ, జనసేన కార్యకర్తలు కొట్టుకున్నారు. Also read:తన ఎమ్యెల్యేలను కొనడానికి బీజేపీ ప్రయత్నించిదంటూ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు మాకేమీ చెప్పడం లేదు-జనసేన నేతలు టీడీపీ(TDP) నేతల తీరుపై జనసేన కార్యకర్తల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీటింగ్‌లపై తమకు కనీస సమాచారం ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడగడంతో గొడవకు దారి తీసింది. దాంతో పాటూ లోకల్ - నాన్ లోకల్ అంటూ అయ్యన్న చేసిన వ్యాఖ్యలూ గొడవకు దారి తీశాయి. లోకల్ అభ్యర్థి వర్మను గెలిపించాలని అయ్యన్న పిలుపును ఇచ్చారు. టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుని చాలా రోజులే అవుతున్నా... పిఠాపురం(Pithapuram) లో ఇప్పటి వరకు టీడీపీ, జనసేన నేతలుకలిసి మీటింగ్ పెట్టుకోలేదు. #andhra-pradesh #tdp #pithapuram #janasena #politics మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి