Citi Bank : 20 వేల మందిని ఇంటికి పంపేస్తున్న సిటీ బ్యాంక్‌!

అమెరికా లోని ప్రముఖ సంస్థ సిటీ బ్యాంక్‌ 20 వేల మంది ఉద్యోగులను తన సంస్థ నుంచి తొలగించడానికి రంగం సిద్దం చేసింది. గడిచిన త్రైమాసికంలో భారీ నష్టాలను చవి చూడడంతో రాబోయే రెండేళ్లలో 20 వేల మంది ఉద్యోగులను కంపెనీ నుంచి తొలగించాలనుకున్నట్లు యజామాన్యం తెలిపింది.

New Update
Citi Bank : 20 వేల మందిని ఇంటికి పంపేస్తున్న సిటీ బ్యాంక్‌!

Citi Bank Plan : అమెరికాకు చెందిన మరో కంపెనీ తమ సంస్థలోని సుమారు 20 వేల మంది ఉద్యోగులను(Layoffs) ఇంటికి పంపేందుకు రంగం సిద్దం చేసినట్లు తెలుస్తోంది. రాబోయే రెండు సంవత్సరాల కాలంలో వీరందరినీ తీసేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ బ్యాంక్‌ కు గడిచిన 14 సంవత్సరాల కాలంలో అత్యంత దారుణమైన త్రైమాసిక ఫలితాలను(Quarter Results) చవి చూడడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ సంస్థలో 2,39 ,000 మంది ఉండగా వారి నుంచి 20 వేల మందిని తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. రాబోయే రెండు సంవత్సరాల కాలంలో బ్యాంకులో పని చేసే మొత్తం ఉద్యోగుల సంఖ్య లో 8 శాతం వరకు తగ్గవచ్చు. కంపెనీ ఇలా చేయడం వల్ల కంపెనీకి సుమారు ఒక బిలియన్‌ డాలర్లు ఖర్చు అవుతాయి.

లాభాల బాటలో..

బ్యాంకు నుంచి తీసివేసిన ఉద్యోగులకు కల్పించే అదనపు సౌకర్యాలతో పాటు జీతంగా ఇవ్వడానికి ఈ మొత్తాన్ని కంపెనీ ఖర్చు చేస్తుంది.
అయితే బ్యాంకు కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌ జేన్‌ ప్రైసెన్‌ బ్యాంక్‌ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా వ్యాపారాన్ని లాభాల బాటలో నడిపించడానికి ఫుల్ బిజీగా ఉన్నారు.

అంతేకాకుండా బ్యాంకు కూడా తన ఖర్చులను తగ్గించి ఆర్థిక వృద్దికి తోడ్పాడాలని ఆలోచిస్తుంది. ఇలా చేయడం వల్ల సంస్థను లాభాల బాటలో నడపడంతో పాటు దాని వ్యయం కూడా 53.5 నుంచి 53.80 బిలియన్‌ డాలర్ల మధ్య ఉండొచ్చని కంపెనీ అంచనా వేస్తుంది. గతేడాది 2023 లో బ్యాంక్‌ మొత్తం ఖర్చు సుమారు 56.40 బిలియన్‌ డాలర్లు.

రాబోయే రెండేళ్లలో..

సిటీ బ్యాంక్‌(Citi Bank) 20 వేల మందిని కంపెనీ నుంచి తొలగించడం వల్ల రాబోయే రెండేళ్లలో 2.5 బిలియన్‌ డాలర్లను ఆదా చేయోచ్చనే ప్లాన్ లో ఉంది. బ్యాంక్‌ అక్టోబర్‌- డిసెంబర్‌ త్రైమాసికానికి సంబంధించిన రిజల్ట్స్ విడుదల చేసింది. సుమారు మూడు నెలల కాలంలోనే కంపెనీ 1.8 బిలియన్‌ డాలర్ల నష్టాన్ని చూసింది.

గత 14 సంవత్సరాలలో అతి గడ్డు కాలాన్ని సంస్థ ఎదుర్కొంటుంది. దీనిని బట్టి చూస్తే బ్యాంక్‌ ఆదాయం 3 శాతం తగ్గింది. 2023 సంవత్సరం తమకు కలిసి రాలేదని అందుకే 2024 తమకు చాలా ముఖ్యమైనదని బ్యాంక్‌ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ జెన్ ఫ్రెషన్ తెలిపారు.

Also read: గోతిలో పడిన అంబులెన్స్‌..లేచి కూర్చున్న శవం!

Advertisment
Advertisment
తాజా కథనాలు