/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/amitabh-jpg.webp)
Big B Amitab Bachhan
భారతీయ టెలివిజన్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన గేమ్ షోలలో 'కౌన్ బనేగా కరోడ్‌పతి(KBC)' ఒకటి. ఈ గేమ్ షో తర్వాత దీన్ని పోలి చాలా భాషల్లో చాలా గేమ్ షోలు వచ్చాయి. అయినా KBC గేమ్ ఫో కంటే ఏదీ పాపులర్ అవ్వలేదు. ఈ షో పేరు చెప్పగానే అమితాబ్(Amitabh Bachchan) మాత్రమే అందరికి గుర్తొస్తాడు. అతని స్థానంలో ఈ గేమ్‌షోకు మరో హోస్ట్‌ని ఊహించుకోలేం. కానీ కేబీసీకి అమితాబచ్చన్ గుడ్ బై చెప్పేశారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే అనౌన్స్ చేశారు. కేబీసీలో మొత్తం 16 ఎపిసోడ్స్ చేసిన అమితాబ్ ఈ ఫోకు ఒక ప్రత్యేకమైన గుర్తింపును తీసుకువచ్చారు. దీనిని అనుసరిస్తూ మిగతా భాషల్లో ఇలాంటి షోలే చాలా వచ్చాయి. కానీ ఎవరూ అమితాబ్ ను బీట్ చేయలేకపోయారు. అయితే ఇప్పుడు కౌన్ బనేగా కరోడ్ పతికి అమితాబ్ బచ్చన్ సెలవు చెప్పాలనుకుంటున్నారు కాబట్టి...దీనిని కొత్త హోస్ట్ నిర్వహించాలని అనుకుంటున్నారుట. ఈ క్రమంలో ముగ్గురి పేర్లు ప్రత్యేకంగా వినిపిస్తున్నాయి.
ఈ సారి హోస్ట్...ఆడా? మగా?
కేబీసీ హోస్ట్ గా అమితాబ్ తర్వాత ఎవరు వస్తారనే దానిపై అందరిలో కుతూహలం నెలకొంది. ఈ క్రమంలో తెరపైకి ముగ్గురి పేర్లు వచ్చాయి. ఇందులో ఒక లేడీ సూపర్ స్టార్ కూడా ఉండడం గమనార్హం. బిగ్ బి 'కౌన్ బనేగా కరోడ్‌పతి'ని వీడాలనే కోరిక వ్యక్తం చేయగానే, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బ్రాండ్స్ (IIHB), ఒక యాడ్ ఏజెన్సీ దీని కొత్త హోస్ట్ గురించి సర్వే చేసింది. ఇందులో కేబీసీ హోస్ట్ గా ఎవరు వస్తే బాగుంటుంది అన్న ప్రశ్నకు 408 మంది పురుషులు, 360 మంది మహిళ దగ్గర నుంచి అభిప్రాయాలను తీసుకున్నారు. వీరిలో అత్యధిక మంది బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ పేరును సజెస్ట్ చేశారు. ఆయన అయితే లెగసీ కంటిన్యూ అవుతుందని అన్నారు. షారూఖ్ తర్వాత అమితాబ్ కోడలు, లేడీ స్టార్ ఐశ్యర్య రాయ్ పేరును కూడా ఎక్కువ మంది చెప్పారు. ఇప్పటి వరకు ఆమె ఎలాంటి కార్యక్రమాలకు హోస్ట్ గా వ్యవహరించలేదు. కాబట్టి కేబీసీకి ఆమె చేస్తే కొత్త కళ వస్తుందని చెప్పారు. ఇక వీరిద్దరి తర్వాత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ పేరును కూడా హోస్ట్ కింద సజెస్ట్ చేశారు.
కేబీసీ ఇక చేయలేనని అమితాబ్ బచ్చన్ ఎప్పటి నుంచో చెబుతున్నారు. సీజస్ 15 తర్వాతనే ఆయన ఈ ప్రొపోజల్ పెట్టారు. అయితే ఛానెల్ వారు తర్వాతి హోస్ట్ ను ఎంపిక చేయలేక పోయారు. దాంతో 16వ సీజన్ కు కూడా అమితాబే హోస్ట్ గా చేశారు. అయితే తాజాగా ముగిసిన 16వ సీజన్ ఎండ్ లో మళ్ళీ అమితాబ్ తాను ఇక హోస్టింగ్ చేయలేనంటూ ఎమోషనల్ అయ్యారు. తన వారసుడిని వెతకమని ఛానెల్ వారికి మళ్ళీ చెప్పారు. ప్రస్తుతం ఆయన వయసు 82 ఏళ్ళు. ఈ వయసులో కూడా అమితాబ్ ఇంకా సినిమాలు చేస్తూనే ఉన్నారు.
Also Read: Business: స్టాక్ మార్కెట్ క్రాష్..ఇన్ఫోసిన్ నారాయణ మూర్తి ఫ్యామిలీ రూ. 6, 800 కోట్లు లాస్