Laila - Vishwak Sen: నేను ఉంటే మైక్ లాగేసే వాడిని.. పృథ్వీపై విశ్వక్ సేన్ సీరియస్... సంచలన ప్రెస్ మీట్!

‘‘లైలా’’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో నటుడు పృథ్వి చేసిన కామెంట్స్ పై విశ్వక్ స్పందించాడు. అది తమముందు జరిగి ఉంటే వెళ్లి మైక్ లాక్కునేవాళ్లమని అన్నాడు. బాయికాట్ లైలా సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం చూసి షాకయ్యామన్నాడు. తమ ఈవెంట్లో జరిగిన దానికి సారీ చెప్పాడు.

New Update
Actor Prithvi sensational comments vishwak sen serious reaction.

Actor Prithvi sensational comments vishwak sen serious reaction

Laila - Vishwak Sen: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తోన్న కొత్త సినిమా ‘లైలా’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న (ఆదివారం) నిర్వహించారు. అయితే ఈ ఈవెంట్ లో నటుడు పృథ్వి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. అతడి కామెంట్స్ పై లైలా మూవీ యూనిట్ తాజాగా స్పందించింది. 

Also Read: బంగ్లాలో కొనసాగుతున్న ఆపరేషన్‌ డేవిల్‌ హంట్‌..1300 మంది అరెస్ట్‌!

బాయికట్ లైలాకు వేల ట్వీట్లు

ఈ మేరకు తాజాగా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఇందులో నటుడు విశ్వక్ సేన్, నిర్మాత సాహు గారపాటి పాల్గొన్నారు. అనంతరం విశ్వక్ మాట్లాడుతూ.. ‘‘బాయికాట్ లైలా’’ సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం చూసి షాక్ కి గురయ్యాము అని అన్నారు. సినిమాను చాలా కష్టపడి తీశామని.. కానీ ఇప్పుడు బాయికట్ లైలా అని 25వేల ట్వీట్లు వేశారు. ఇది ఎంతవరకు న్యాయమని అన్నారు.

Also Read: డాంకీ రూట్‌ లో అమెరికా వెళ్తూ..పంజాబ్‌ యువకుడి మృతి!

వాడి ఖాతాలో వీడు బలి

అంతేకాకుండా సినిమా రిలీజ్ అయిన అతి కొద్ది సమయంలోనే హెచ్ డి ప్రింట్ పెడతామని అనడం ఎంతవరకు కరెక్ట్ అని అన్నారు. అలాగే వాడి ఖాతాలో వీడు బలి అంటూ దాదాపు 25వేలకు పైగా ట్వీట్ల మీద ట్వీట్లు వేశారని తెలిపారు. తనతో శత్రుత్వం ఏంటని.. తనను లాగితే ఏమొస్తది అంటూ ఆవేదనకు గురయ్యారు. 

Also Read: ఏకంగా బౌన్సర్లను పెట్టి మరీ గెంటెస్తున్న టెక్‌ కంపెనీలు

మైక్ లాక్కునేవాళ్లం

ఆ సంఘటన తమ కంట్రోల్ లో జరగలేదని.. ఒకవేళ అది తమ ముందు జరిగి ఉంటే వెంటనే వెళ్లి ఆయన వద్ద ఉన్న మైక్ లాక్కునేవాళ్లమని అన్నారు. తాము ఆ సమయంలో అక్కడ లేమని.. చిరంజీవిని రిసీవ్ చేయడానికి బయటకు వెళ్ళినప్పుడు అతను అలా మాట్లాడాడని తెలిపారు. 

అంతేకాకుండా గెస్ట్ లుగా వచ్చిన వాళ్ళు ఏమి మాట్లాడతారో తమకు తెలీదని.. సినిమాలో ఎవరో ఒక తప్పు చేస్తే మిగిలిన వాళ్ళు తప్పు చేసినట్టేనా అని అన్నారు. అందువల్ల తమ ఈవెంట్ లో జరిగిన దానికి తాను సారీ చెప్తున్నానని పేర్కొన్నారు. ప్రస్తుతం అతడి వ్యాఖ్యలకు చెక్ పడుతుందా? లేదా? అనేది చూడాలి.  

పృథ్వీ ఏమన్నారంటే?

లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పృథ్వీ మాట్లాడుతూ.. ఇన్ డైరెక్ట్ గా వైసీపీపై సెటైర్లు వేశారు. ఒక వ్యక్తిని మేకల మంద దగ్గరకు తీసుకెళ్లి ఎన్ని ఉన్నాయ్ రా అని అడిగితే.. మొత్తం 150 మేకలు ఉన్నాయని.. ఇక సినిమా అయిపోయే ముందు మరో సీన్ లో కరెక్ట్ గా లెక్కేస్తే 11 ఉన్నాయని వ్యంగ్యంగా మాట్లాడారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో వైసీపీ ఫ్యాన్స్ ‘‘బాయ్ కట్ లైలా’’ అనే ట్యాగ్ ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేసారు. ఇది చూసి విశ్వక్ అండ్ మూవీ టీం దీనిపై స్పందించింది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు