/rtv/media/media_files/2025/01/19/6TzkLKVKz4pjLYr5MyU5.jpg)
actor vishal
కోలీవుడ్ హీరో విశాల్ మదగదరాజా ప్రమోషన్స్‌లో అనారోగ్యంగా విధంగా కనిపించడం అభిమానులను కలవరపెట్టింది. స్టేజీపై నిలబడేందుకు కష్టపడటం, నడవలేకపోవడం, చేతిలో మైక్ పట్టుకున్నప్పుడు వణకడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. దింతో అసలు విశాల్‌కు ఏమైంది? అని అభిమానులు ఆరా తీశారు.
Also Read : పవన్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్..!
OG thalaivan vishal 🪩💃🏻 pic.twitter.com/ZtLavuelYZ
— Prathiiii (@Prathikax5) January 18, 2025
ఈ విషయంపై విశాల్ టీమ్ వివరణ ఇచ్చింది. విశాల్‌కు హై ఫీవర్ వచ్చిందని, వైద్యులు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించినప్పటికీ, సినిమా ప్రమోషన్స్ కోసం ఆయన హాజరయ్యారని పేర్కొన్నారు. ఆ తర్వాత విశాల్ తన ఆరోగ్యంపై స్పందిస్తూ..నేను ఆరోగ్యంగా ఉన్నాను. నా కోసం ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అభిమానులకు ధైర్యం చెప్పాడు.
Actor #Vishal is Baaacccck 🔥 pic.twitter.com/2yBCx1QMap
— Let's X OTT GLOBAL (@LetsXOtt) January 19, 2025
ఇక 'మదగదరాజా' సినిమా సక్సెస్ కావడంతో టీం మొత్తం ఆనందంలో మునిగిపోయింది. చాలా కాలం తర్వాత విశాల్ పాత సినిమా విడుదలై హిట్ కావడంతో ఆయన ఫుల్ హ్యాపీగా ఉన్నారు. నిన్న జరిగిన సక్సెస్ పార్టీకి హాజరైన విశాల్.. సక్సెస్ సెలెబ్రేషన్స్ లో భాగంగా పార్టీలో అదిరిపోయే స్టెప్పులు వేస్తూ ఫుల్ ఎనర్జీతో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీన్ని చూసిన ఫ్యాన్స్, నెటిజన్స.. ఫైనల్లీ విశాల్ ఫిట్ నెస్ తో కం బ్యాక్ ఇచ్చాడని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: మనోజ్‌పై మోహన్ బాబు విక్టరీ.. ఇళ్లు ఖాళీ చేయాల్సిందేనని కలెక్టర్ ఆదేశాలు!
As #VijayAntony sir promised. Actor #Vishal singing my dear lover song 🔥🔥🔥🔥 pic.twitter.com/gxLQ720uUj
— Mani (@mani17081996) January 18, 2025