Jana Nayagan: దళపతి చివరి పొంగల్ ట్రీట్.. 'జన నాయగన్' విడుదల తేదీ వచ్చేసింది?

దళపతి విజయ్ 'జన నాయగన్' మూవీ  విడుదల తేదీని ఎట్టకేలకు ప్రకటించారు మేకర్స్. 2026 జనవరి 14న విడుదల కానున్నట్లు తెలియజేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. హెచ్ వినోద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 

New Update
Jana Nayagan  release date

Jana Nayagan release date

Jana Nayagan:  తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్  ఆఖరి చిత్రం 'జన నాయగన్' మూవీ  విడుదల తేదీని ఎట్టకేలకు ప్రకటించారు మేకర్స్. వచ్చే ఏడాది పొంగల్ కానుకగా జనవరి 14, 2026న  ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.  తమిళం, తెలుగు మరియు హిందీ భాషలలో గ్రాండ్ గా విడుదల కానుంది. 'జన నాయగన్' విజయ్ చివరి ఫిల్మ్ కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కెవిఎన్ ప్రొడక్షన్స్‌ పై నిర్మిస్తున్న మొదటి పాన్ ఇండియా చిత్రమిది. ఇందులో పూజా హెగ్డే,  బాబీ డియోల్,  గౌతమ్ వాసుదేవ్ మీనన్,  ప్రియమణి, ప్రకాష్ రాజ్, నరేన్, మమిత బైజు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హెచ్ వినోద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.

Also Read: Pawan Kalyan: ఇకపై సినిమాలు చేయరా? పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

రాజకీయాల్లో బిజీ

ఈ సినిమా తర్వాత విజయ్ రాజకీయాల్లో బిజీ కాబోతున్నారు. తాను కొత్తగా స్థాపించిన తమిళగ వెట్రీ కజగం (టీవీకే) పార్టీ నుంచి 2026 తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం. ఫిబ్రవరిలో జరిగిన ఒక ర్యాలీలో కూడా విజయ్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. తాను రాజకీయాలపై దృష్టి పెట్టాలనుకుంటున్నానని, ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉండాలని కోరుకుంటున్నానని ఆయన పునరుద్ఘాటించారు.

ఇదిలా ఉంటే రీసెంట్ గా విజయ్  'గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ది టైం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. గతేడాది విడుదలైన ఈ చిత్రం ఊహించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈమూవీలో త్రిష, మీనాక్షి చౌదరీ, స్నేహ, ప్రభుదేవా ప్రధాన పాత్రలో నటించారు.  

ఇది కూడా చూడండి: SSMB 29 Updates: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Hit 3 Song: ‘హిట్ 3’ నుంచి అర్జున్ సర్కార్ పవర్‌ఫుల్ సాంగ్.. అనిరుధ్ పాడిన పాట విన్నారా?

నాని ‘హిట్ 3’ మూవీ నుంచి మూడో సాంగ్ రిలీజ్ అయింది. ‘తన కోసమే నా పొగరే’.. అంటూ సాగే ఈ సాంగును మ్యూజిక్‌ డైరెక్టర్ అనిరుధ్‌ ఆలపించాడు. మిక్కీ జే. మేయర్‌ స్వరాలు అందించారు. ప్రస్తుతం ఈ సాంగ్‌ యూట్యూబ్‌లో అదిరిపోయే రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. 

New Update
HIT 3 new song

HIT 3 new song

నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న కొత్త చిత్రం ‘హిట్ 3’. శైలేశ్‌ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇప్పుడు రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ‘హిట్‌’ ఫ్రాంచైజీలో వస్తోన్న మూడో చిత్రం కావడంతో అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి పార్ట్‌లో విశ్వక్ సేన్, సెకండ్ పార్ట్‌లో అడివి శేష్ నటించి బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నారు. ఇప్పుడు మూడో పార్ట్‌లో నేచురల్ స్టార్ నాని నటిస్తుండటంతో అందరిలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. 

మూడో సాంగ్

ఈ సినిమాలో నాని.. అర్జున్ సర్కార్‌గా పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నాడు. ఈ చిత్రం అన్ని పనులు పూర్తి చేసుకుని మే 1న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ వేగవంతం చేసిన మూవీ యూనిట్.. తాజాగా ఈ సినిమాలోని మూడో సాంగ్‌ను రిలీజ్ చేసింది. ‘తన కోసమే నా పొగరే’.. అంటూ సాగే ఈ సాంగును మ్యూజిక్‌ డైరెక్టర్ అనిరుధ్‌ ఆలపించాడు. మిక్కీ జే. మేయర్‌ స్వరాలు అందించారు. ప్రస్తుతం ఈ సాంగ్‌ యూట్యూబ్‌లో అదిరిపోయే రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. 

Hit 3 Song | actor-nani | Srinidhi Shetty HIT- 3 | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment