/rtv/media/media_files/2026/05/07/vijay-jana-nayagan-2026-05-07-13-13-47.jpg)
Vijay Jana Nayagan
Vijay Jana Nayagan: తమిళ స్టార్ హీరో విజయ్ Vijay నటిస్తున్న జన నాయకుడు Jana Nayagan సినిమా మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో సినిమా టైటిల్ కార్డ్‌పై “తమిళనాడు గౌరవ ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్” అని కనిపించడం అభిమానుల్లో పెద్ద చర్చకు దారితీసింది. థియేటర్లలో ఈ టైటిల్ కనిపించగానే అభిమానులు భారీగా సంబరాలు చేసుకుంటున్న వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి.
Also Read: విజయ్ నీకు ఆరు నెలలు టైమ్ ఇస్తాం.. స్టాలిన్ సంచలన కామెంట్స్!
Vijay Jana Nayagan Title Card
India's first time CM title card for actor ! #TVKVijay 🥵🥵 pic.twitter.com/vHqDuRenku
— 𝗚𝗥𝗜𝗠_𝗦𝗣𝗘𝗖𝗧𝗘𝗥 ᴶᴱᴱⱽᴬ (@leodas_jeeva) May 6, 2026
అయితే ఈ వీడియో నిజంగా సినిమా నుంచి వచ్చిందా? లేక AI టెక్నాలజీతో ఎడిట్ చేశారా? అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. మూవీ టీమ్ కూడా దీనిపై అధికారికంగా స్పందించలేదు.
దర్శకుడు H. Vinoth తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రాజకీయ నేపథ్యం కూడా ఉంటుందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అదే కారణంగా సెన్సార్ సమస్యలు ఎదురయ్యాయని, విడుదల ఆలస్యం అయిందని టాక్ వినిపిస్తోంది.
Also Read: TMC రెండు ముక్కలు...మమత మీటింగ్‌కు 10 మంది ఎమ్మెల్యేల డుమ్మా!
ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే Pooja Hegde నటిస్తుండగా, విలన్ పాత్రలో బాబీ డియోల్ bobby-deol కనిపించనున్నారు.
మొదట ఈ సినిమాను పొంగల్ సందర్భంగా విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ సెన్సార్ సర్టిఫికెట్ ఆలస్యం కావడంతో రిలీజ్ వాయిదా పడింది. ఇప్పుడు మే 15న సినిమా విడుదల కావచ్చని సమాచారం.
Also Read: అదిరిపోయే అప్‌డేట్.. బాలయ్యతో బాలీవుడ్ బ్యూటీ స్పెషల్ సాంగ్!
ఇక విజయ్ స్థాపించిన రాజకీయ పార్టీ Tamilaga Vettri Kazhagam ఇటీవల తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించడంతో అభిమానుల్లో మరింత ఉత్సాహం కనిపిస్తోంది. పార్టీ 234 స్థానాల్లో 108 సీట్లు గెలవడంతో విజయ్ ముఖ్యమంత్రి అవుతారని అంత సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన పూర్తి మెజారిటీపై ఇంకా స్పష్టత లేదని సమాచారం. ఈ నేపథ్యంలో విజయ్ గవర్నర్‌ను మరోసారి కలిసినట్లు తమిళ మీడియా కథనాలు చెబుతున్నాయి.
Follow Us