కేరళ రోడ్లపై విజయ్ దేవరకొండ జాగింగ్.. రౌడీ హీరోను ఆపిన పోలీసులు విజయ్ దేవరకొండ ప్రస్తుతం కేరళలో ఉన్నాడు. అక్కడే 'VD12' మూవీ షూటింగ్ జరుగుతోంది. తాజాగా ఆయన కేరళ నుంచి పలు వీడియోలు ఇన్ స్టాలో షేర్ చేసాడు. అందులో విజయ్ జాగింగ్ చేస్తుంటే మధ్యలో కొంతమంది ఫారెస్ట్ ఆఫీసర్స్ వచ్చి అతనితో ఫోటోలు దిగారు. By Anil Kumar 11 Oct 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం కేరళలో ఉన్నాడు. అక్కడే 'VD12' మూవీ షూటింగ్ జరుగుతోంది. రీసెంట్ గానే శ్రీలకంలో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకోగా.. తాజాగా షూటింగ్ ను కేరళకు షిఫ్ట్ చేశారు. అయితే విజయ దేవరకొండ కేరళ నుంచి పలు వీడియోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు. అందులో విజయ్ జాగింగ్ చేస్తూ కేరళలో కొండ ప్రాంతంపై నిలిబడి సేదతీరుతున్నాడు. ఫారెస్ట్ ఆఫీసర్లు ఆపి మరీ.. కేరళలో టీ తోటల మధ్య ఉదయాన్నే జాగింగ్ చేస్తున్న వీడియోలు, అలా జాగింగ్ చేస్తుంటే మధ్యలో కొంతమంది ఫారెస్ట్ ఆఫీసర్స్ వచ్చి విజయ్ దేవరకొండతో ఫోటోలు దిగడం, కొండ అంచున నిలబడి సేద తీరడం లాంటి వీడియోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు. అలాగే తాను జాగింగ్ చేసిన రూట్ మ్యాప్, అప్పుడు తన హార్ట్ బీట్.. లాంటి డీటెయిల్స్ కూడా షేర్ చేశాడు. Also Read : వరుసగా ఆరు సార్లు అనారోగ్యం.. పవన్ స్టార్ కు అసలేమైంది? దీంతో ఆ వీడియోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ వీడియోలో విజయ్ దేవరకొండ లుక్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. ఇక 'VD 12' విషయానికొస్తే.. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య కలిసి భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో నిర్మిస్తున్నారు. విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా కనిపించనుంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ స్పెగా కనిపిస్తారని, ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలయ్యే చాన్స్ ఉందనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. దానిపై మూవీ టీమ్ నుంచి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. వచ్చే ఏడాది మార్చి 25న చిత్రం రిలీజ్ కానుంది. View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda) #tollywood #vijay-devarakonda #vd12 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి