కోలీవుడ్ లో మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న విజయ్ ఆంటోని.. హీరోగానూ స్టార్ ఇమేజ్ కైవసం చేసుకున్నారు. ముఖ్యంగా 'బిచ్చగాడు' సినిమాతో ఈయనకు తెలుగులోనూ మంచి క్రేజ్ ఏర్పడింది. దీంతో ఆయన తన సినిమాలను డబ్బింగ్ రూపంలో తెలుగులోనూ రిలీజ్ చేసి ఇక్కడ కూడా మంచి మార్కెట్ సెట్ చేసుకున్నారు. ఈ ఏడాది విజయ్ ఆంటోని నటించిన రోమియో, తుపాన్, హిట్లర్ వంటి మూడు సినిమాలు వరుసగా విడుదలయ్యాయి. అయితే, ఈ చిత్రాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ పొందలేదు. అది పక్కనబెడితే, విజయ్ ఆంటోని సంగీత దర్శకుడిగా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారని అందరికీ తెలిసిందే. Also Read: యూట్యూబ్ ను షేక్ చేసిన ఏకైక ఇండియన్ సాంగ్..'కుర్చీ మడతపెట్టి' నయా రికార్డ్ pic.twitter.com/it0yIvHs2N — vijayantony (@vijayantony) December 28, 2024 గత కొన్ని సంవత్సరాలుగా ఏఆర్ రెహమాన్, జివి ప్రకాష్, ఇళయరాజా తరహాలో లైవ్ కాన్సర్ట్‌లు నిర్వహిస్తూ మంచి స్పందనను దక్కించుకుంటున్న ఆయన, ఈ రోజు చెన్నైలో విజయ్ ఆంటోని 3.0 లైవ్ కాన్సర్ట్ ప్లాన్ చేశారు. అయితే, అనుకోని పరిస్థితుల కారణంగా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయాల్సి వచ్చిందని, తన బాధను వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. Also Read: పవన్ ను ఇబ్బంది పెట్టకండి.. ఫ్యాన్స్ కు 'ఓజీ' మేకర్స్ రిక్వెస్ట్ అందులో, " హలో ఫ్రెండ్స్.. అనివార్య పరిస్థితుల దృష్ట్యా, ప్రభుత్వ అధికారుల సూచన మేరకు ఈ రోజు చెన్నైలో జరగాల్సిన విజయ్ ఆంటోని 3.0 లైవ్ కాన్సర్ట్‌ను మరో తేదీకి మార్చడం జరిగింది. మీకు కలిగిన అసౌకర్యానికి క్షమించండి. కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తాం.." అని తెలిపారు. ఈ ప్రకటనతో అభిమానులు కొంత నిరాశ చెందుతున్నారు.