Venu Swamy : త్రిష వల్లే విజయ్కు ఈ దరిద్రం.. వేణుస్వామి సంచలన జాతకం!

వేణుస్వామి జ్యోతిష్య విశ్లేషణ ప్రకారం.. విజయ్, త్రిష కాంబినేషన్ అనేది జాతక రీత్యా ఏకనాడి కాంబినేషన్. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ సాధించిన అఖండ విజయానికి, త్రిషకు గల గ్రహస్థితులకు బలమైన లింక్ ఉందట.

New Update
vijay

తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడి రాజకీయ ముఖచిత్రం శరవేగంగా మారిపోతోంది. ఒకవైపు తమిళనాడులో తమిళగ వెట్రి కళగం (TVK) కూటమి పార్టీలతో దళపతి విజయ్ సీఎం పీఠాన్ని అధిరోహించేందుకు సిద్ధమవుతుండగా.. మరోవైపు బెంగాల్‌లో మమతా బెనర్జీని ఓడించి బీజేపీ తరఫున సువేందు అధికారి సీఎం పగ్గాలు చేపట్టబోతున్నారు. ఈ హాట్ పొలిటికల్ సిట్యుయేషన్స్ మధ్య.. సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ వేణుస్వామి చెప్పిన సరికొత్త జోస్యం ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. విజయ్ పొలిటికల్ ఎంట్రీ, త్రిష ఇంపాక్ట్.. అలాగే బెంగాల్ భవిష్యత్తుపై వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఇంతకు ఆయన ఏం అన్నారంటే 

వేణుస్వామి జ్యోతిష్య విశ్లేషణ ప్రకారం.. విజయ్, త్రిష కాంబినేషన్ అనేది జాతక రీత్యా ఏకనాడి కాంబినేషన్. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ సాధించిన అఖండ విజయానికి, త్రిషకు గల గ్రహస్థితులకు బలమైన లింక్ ఉందట. ఒకవేళ విజయ్ జాతకంలో త్రిష ప్రభావం లేకపోయి ఉంటే.. ఈ ఎన్నికల్లో విజయ్ ఫలితం, ఆయన రాజకీయ భవిష్యత్తు పూర్తిగా మరోలా ఉండేవని వేణుస్వామి విశ్లేషించారు.  గురు గ్రహ మార్పును విశ్లేషిస్తూ తమిళనాడు రాజకీయాలపై వేణుస్వామి షాకింగ్ ప్రిడిక్షన్ ఇచ్చారు. మే 25వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ మధ్యలో గురువు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారని.. ఆ తర్వాత సెప్టెంబర్‌లో సింహ రాశిలోకి వెళ్తారని చెప్పారు. ఈ గురు గ్రహ మార్పుల వల్ల తమిళనాడు ప్రభుత్వంలో తీవ్ర అస్థిరత ఏర్పడుతుందన్నారు.  విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ.. అది ఎక్కువ కాలం నిలవకపోవచ్చు అని పెద్ద బాంబు పేల్చారు.  కేవలం ఆరు నెలలు లేదా ఏడాది లోపే తమిళనాడులో మళ్లీ ఎన్నికలు వచ్చే అవకాశం కచ్చితంగా ఉందని వేణుస్వామి తేల్చి చెప్పారు.

ఇక పశ్చిమ బెంగాల్ ల్లో మమతా బెనర్జీ జాతకంలో 2027 సెప్టెంబర్ వరకు అష్టమ శని నడుస్తోందని.. అందుకే ఆమెకు పరాజయం తప్పలేదని పేర్కొన్నారు. రానున్న ఏడాది లేదా ఏడాదిన్నర కాలంలో అక్కడ తీవ్ర ఉగ్రవాద చర్యలు, మత కల్లోలాలు, హింసాత్మక ఘటనలు జరిగే ముప్పు ఉందట. శాంతిభద్రతల క్షీణత కారణంగా.. చివరకు అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ కేంద్రం రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడు ఏ జ్యోతిష్యం చెప్పినా సంచలనంగా మారే వేణుస్వామి.. ఇప్పుడు ఏకంగా తమిళనాడు, బెంగాల్‌ ప్రభుత్వాల భవిష్యత్తుపైనే ఈ రేంజ్ ప్రిడిక్షన్స్ ఇవ్వడంతో పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Advertisment
తాజా కథనాలు