సంధ్య థియేటర్ తొక్కిసలాటలో రేవతి అనే మహిళా మృతి చెందిన విషయం తెలిసిందే. ఇదే ఘటనలో ఆమె కొడుకు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి ప్రస్తుతం కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. అయితే తాజాగా సెలెబ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామి కిమ్స్ హాస్పిటల్ కు వెళ్లి శ్రీతేజ్ ను పరామర్శించి బాధిత కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందజేశాడు. ఎట్టకేలకు మంచి సహాయం చేసిన వేణుస్వామి.. సంధ్య థియేటర్ ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్ కు రూ.2 లక్షల చెక్!#Venuswamy #AlluArjun #SandhyaTheatreTragedy #SandhyaTheatreIncident #RTV pic.twitter.com/feC52ll7WA — RTV (@RTVnewsnetwork) December 25, 2024 ఈ మేరకు శ్రీతేజ్ తండ్రి భాస్కర్ కి రూ.లక్షల చెక్ అందజేశారు. కాగా వేణు స్వామితో పాటూ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సైతం కిమ్స్ ఆసుపత్రికి వచ్చి శ్రీతేజ్ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..' శ్రీతేజ్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. అతన్ని చూడగానే ఆనందం వేసింది. అతను త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళ ఫ్యామిలీకి మేము అంటే మా కొరియోగ్రాఫర్ యూనియన్ ఎప్పుడూ అండగా ఉంటుంది..' అని పేర్కొన్నారు.