వరుణ్ తేజ్ ‘మట్కా’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్.. ఇక పూనకాలే

వరుణ్ తేజ్ - కరుణ కుమార్ దర్శకత్వంలో ‘మట్కా’ మూవీ గ్రాండ్ లెవెల్లో తెరకెక్కుతోంది. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ డేట్‌కు సంబంధించి మేకర్స్ సర్‌ప్రైజ్ అందించారు. మూవీ టీజర్‌ను అక్టోబర్ 5న విడుదల చేస్తున్నట్లు అఫీషియల్‌గా వెల్లడించారు.

New Update
varun tej

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒక భారీ హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగానే వరుస సినిమాలు చేస్తున్నాడు. కానీ ఆశించిన స్థాయిలో ఫలితం అందుకోలేకపోతున్నాడు. ఎప్పుడో 2019లో గద్దలకొండ గణేష్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా అందుకోలేకపోయాడు. ఆ సినిమా తర్వాత గని, గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్ వంటి సినిమాలు చేశాడు. కానీ ఈ సినిమాలేవి పెద్దగా హిట్ కాలేకపోయాయి. అయినా ఎప్పుడూ ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. ఇందులో భాగంగానే ఇటీవల మరో కొత్త కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 

‘పలాస 1978’ మూవీ ఫేం కరుణ కుమార్ దర్శకత్వంలో ‘మట్కా’ మూవీ చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాపైనే వరుణ్ ఆశలు పెట్టుకున్నాడు. మట్కా మూవీతో భారీ హిట్ కొట్టి మళ్లీ ఫాంలోకి రావాలని చూస్తున్నాడు. ఈ సినిమా కోసం భాగా హార్డ్‌వర్క్ చేస్తున్నాడు. దర్శకుడు కరుణ కుమార్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. 

ఇది కూడా చదవండి: 'నీతో ఇక బ్రేకప్..' జెనిలియాకు భర్త రితీశ్‌ మెసేజ్.. అసలేం జరిగింది?

అలాగే ఈ చిత్రానికి విజేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి కలిసి నిర్మిస్తున్నారు. ఎన్నో సినిమాల్లో అందచందాలతో కుర్రకారు మనసు దోచుకున్న నటి మీనాక్షి చౌదరి ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు సినీ ప్రియుల్లో సరికొత్త ఆసక్తిని రేకెత్తించాయి. కాగా ఇటీవల విడుదలైన పోస్టర్ మాత్రం మరింత బజ్ క్రియేట్ చేసింది. అందులో వరుణ్ రెండు విభిన్న గెటప్‌లో కనిపించి హైప్ పెంచేశాడు. 

మట్కా టీజర్ రిలీజ్ డేట్

ఇలా పోస్టర్లతోనే అంచనాలు పెంచేసిన మూవీ యూనిట్ తాజాగా అదిరిపోయే అప్డేట్ అందించింది. ఇందులో భాగంగా మూవీ టీజర్‌ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ మేకర్స్ సర్‌ప్రైజ్ అందించారు. ఈ సినిమా టీజర్‌ను అక్టోబర్ 5న రిలీజ్ చేస్తున్నట్లు అఫీషియల్‌గా వెల్లడించారు. ఈ మేరకు ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో వరుణ్ పిస్టల్ పట్టుకుని కనిపిస్తున్నాడు. ఈ అప్డేట్‌తో మెగా అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇకపోతే ఈ సినిమా అన్ని పనులు పూర్తి చేసుకుని నవంబర్ 14న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది.

Also Read :  రజినీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఇంటికి చేరిన తలైవా

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

MS Dhoni రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్

చిత్రనిర్మాత కరణ్ జోహార్ ఇండియన్ క్రికెటర్ ఎం. ఎస్ ధోని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే ధోని ఓ కొత్త రొమాంటిక్ అవతార్ లో కనిపించబోతున్నట్లు వీడియో రిలీజ్ చేశారు. దీంతో ధోని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

New Update
MS DHONI VIDEO

MS DHONI VIDEO

MS Dhoni టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎం. ఎస్ ధోని క్రికెట్ తో పాటు సినిమా రంగంలోకి కూడా అడుగుపెట్టారు. 2023లో  'లెట్స్ గెట్ మ్యారీడ్' అనే సినిమాకు డిస్ట్రిబ్యూటర్ గా పనిచేశారు. అయితే ఇప్పుడు ధోని హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి కారణం బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ షేర్ చేసిన వీడియో.  ధోని ఓ కొత్త రొమాంటిక్ అవతార్ లో కనిపించబోతున్నారు అంటూ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో ధోని హార్ట్  సింబల్ బెలూన్ చేతిలో పట్టుకొని కనిపించారు. దీంతో ఫ్యాన్స్ ధోని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అని అనుకుంటున్నారు. అంతేకాదు కరణ్ ఈ వీడియోను షేర్ చేయడంతో.. ధోనిని కరణ్ జోహార్ పరిచయం చేయబోతున్నారా అని కామెంట్లు పెడుతున్నారు. కానీ.. ఇంతలోనే అసలు విషయం బయటపడింది.

యాడ్ ఫిల్మ్ షూట్

 ఆ వీడియో ఒక యాడ్ ఫిల్మ్ షూట్ కి సంబంధించినదని తెలిసింది. ఈ వీడియోకి గల్ఫ్ ఆయిల్ కంపెనీని ట్యాగ్ చేయడంతో.. ఇది యాడ్ షూట్ కి సంబంధించిన వీడియో అని అర్థమైంది. ఏదేమైనా మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే గతంలో కూడా ధోని సినిమాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. ఇటీవలే రామ్ చరణ్ - బుచ్చిబాబు rc16 లో ధోని క్యామియో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత చిత్రబృందం అలాంటిదేమి లేదని చెప్పడంతో పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది.  

ప్రస్తుతం ధోని  CSK కెప్టెన్‌గా గా వ్యవహరిస్తున్నారు. వరుసగా ఐదు మ్యాచుల పరాజయాల తర్వాత.. తాజాగా జరిగిన లక్నో సూపర్ జెయింట్స్‌ వర్సెస్ CSK మ్యాచ్ లి చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. ఈ విజయంలో ధోని కీలక పాత్ర పోషించడం విశేషం. 

telugu-news | latest-news | ms-dhoni | karan-johar

Advertisment
Advertisment
Advertisment