/rtv/media/media_files/2024/11/30/XcYD7JxhBA1igaw8PW6W.jpg)
మెగా హీరోల్లో డిఫెరెంట్ మూవీస్ తో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వరుణ్ తేజ్ ఇటీవల 'మట్కా' అనే సినిమాతో పేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ‘పలాస 1978’ మూవీ ఫేం కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదలై భారీ డిజాస్టర్ అయింది.
Also Read: ఫడ్నవిస్‌కు బిగ్ షాక్.. మహారాష్ట్ర సీఎంగా కేంద్రమంత్రికి ఛాన్స్
ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్..
నవంబర్ 14 న రిలీజ్ అయిన ఈ మూవీ నిర్మాతలకు రూ.60 కోట్లకు పైగా నష్టాలను మిగిల్చింది. 'గాండీవ దారి అర్జున' తర్వాత వరుణ్ తేజ్ ఖాతాలో 'మట్కా' మరో డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. డిసెంబరు 5 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి 'మట్కా' స్ట్రీమింగ్ కానుంది.
Also Read: బైక్‌ను తప్పించబోయి బస్సు బోల్తా... అక్కడికక్కడే 10 మందికి పైగా మృతి
risk, reward & gamble - MATKA Vasu is the ringmaster who rules them all 👑#MatkaOnPrime, December 5 pic.twitter.com/Djsux1H6nJ
— prime video IN (@PrimeVideoIN) November 30, 2024
ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ ఓటీటీ సంస్థ అధికారికంగా అనౌన్స్ చేసింది. థియేటర్లలో రిలీజైన మూడు వారాల్లోనే 'మట్కా' ఓటీటీలోకి రావడం గమనార్హం. థియేటర్స్ లో ఆడియన్స్ ను ఏమాత్రం మెప్పించలేకపోయిన ఈ సినిమా కనీసం ఓటీటీలోనైనా మంచి రెస్పాన్స్ అందుకుంటుందేమో చూడాలి.
Recent Telugu Utter Flop Film #MATKA Première On Amazon Prime Video From DECEMBER 5🔥 pic.twitter.com/zpFYsi6Ykt
— Saloon Kada Shanmugam (@saloon_kada) November 30, 2024