/rtv/media/media_files/2025/03/31/UFtLd2YkAz0nJ1CxGr9p.jpg)
klinkara ugadi celebrations video
Klinkara Video: మెగా కోడలు ఉపాసన కొణిదెల తరచూ సోషల్ మీడియాలో ఫ్యామిలీ, బిజినెస్ కి సంబంధించిన విషయాలను పోస్ట్ చేస్తూనే ఉంటారు. తాజాగా ఉగాది సందర్భంగా ఇంట్లో ఉగాది సెలెబ్రేషన్స్ వీడియోను పంచుకుంది. అయితే ఈ వీడియోలో మెగా ప్రిన్సెస్ క్లింకారా కొణిదెల ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అమ్మ, నాన్నమ్మతో కలిసి పూజలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది క్లింకార. పింక్ పట్టులంగా ధరించి ఎంతో ముద్దుగా కనిపించింది. అయితే పుట్టునప్పటి నుంచి క్లింకార ఫేస్ ఎలా ఉందో చూడాలని ఆరాటపడుతున్న మెగా ఫ్యాన్స్ కి మళ్ళీ నిరాశే మిగిలింది.
Also Read: Janhvi Kapoor: సూట్ విప్పి.. ర్యాంప్ పై అదరగొట్టిన జాన్వీ.. నడుస్తుంటే మామూలుగా లేదుగా! వీడియో వైరల్
ఈసారి కూడా..
ఇప్పుడు కూడా క్లింకార ఫేస్ కనిపించకుండా.. జాగ్రత్త పడుతూ సైడ్ యాంగిల్స్ లో వీడియో తీశారు. అయినప్పటికీ కాస్త కనిపిస్తుండడంతో మెగాభిమానులు పండగ చేసుకుంటున్నారు. పింక్ డ్రెస్ లో పద్దతిగా నాన్నమ్మతో పూజలో కూర్చున్న క్లింకార ఫొటోను తెగ వైరల్ చేస్తున్నారు.
klinkara-konidela | upasana-konidela | Ram Charan
Also Read: Actress Abhinaya: హీరో కాదు బిజినెస్ మ్యాన్.. కాబోయే భర్తను పరిచయం చేసిన అభినయ!