ఎందుకు బాలయ్య ఇలా చేశావ్.. ఎన్టీఆర్ గురించి అడిగాలనిపించలేదా?

అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే తాజా షోలో బన్నీ గెస్ట్‌గా హాజరయ్యాడు. ఈ షోలో బాలయ్య-బన్నీ మధ్య మాటలు నవ్వులు పూయించాయి. పవన్, ప్రభాస్, మహేశ్ గురించి అడిగిన బాలయ్య ఎన్టీఆర్ గురించి అడగకపోవడం ఫ్యాన్స్‌ను నిరాశ పడ్డారు. సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

New Update
ntr,.

నందమూరి నటసింహం బాలయ్య బాబు హోస్ట్ చేసిన ప్రముఖ షో ‘అన్‌స్టాపబుల్’ మూడు సీజన్లు అద్భుతమైన రెస్పాన్స్‌ను అందుకున్నాయి. కనివిని ఎరుగని రీతిలో ఈ షో ప్రేక్షకాదరణను సంపాదించింది. సెలబ్రెటీలు, రాజకీయ నాయకులతో బాలయ్య బాబు హంగామా మామూలుగా ఉండదు. ప్రొఫెషనల్ లైఫ్‌తో పాటు వ్యక్తిగత లైఫ్‌కు సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకునే క్రమంలో వారి మధ్య సందడి ఓ రేంజ్‌లో ఉంటుంది. 

ఇది కూడా చదవండి: లగచర్ల భూములు ముట్టుకుంటే ఊరుకోం.. రేవంత్ కు మావోయిస్టుల సంచలన లేఖ!

మొదటి ఎపిసోడ్‌కు సీఎం చంద్రబాబు

ఇక ఇటీవల అన్‌స్టాపబుల్ సీజన్ 4 మొదలైంది. మొదటి ఎపిసోడ్‌కు సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఆయనతో బాలయ్య బాబు ముచ్చట్లు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ షోకు గెస్ట్‌గా వచ్చారు. ఈ షోలో బాలయ్య- బన్నీ మధ్య హంగామా అదరిపోయింది. ఎపిసోడ్ మొత్తం నవ్వులే నవ్వులు అని చెప్పాలి. 

ఇక ఈ షో భాగంగా బాలయ్య.. బన్నీకి అడిగిన ప్రశ్నలకు ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా ఆన్సర్ చెప్పడం ఇంకాస్త అదిరిపోయాయి. అయితే ఈ షోలో బాలయ్య బాబు ఇండస్ట్రీలోని కొందరి సెలబ్రిటీల గురించి అడిగారు. ముందుగా బన్నీ ఫ్యామిలీ గురించి అడిగారు. తర్వాత సినిమాలు, స్నేహితుల గురించి మట్లాడారు. 

ఎన్టీఆర్ గురించి ఒక్క మాట అడగలేదు

ముఖ్యంగా ఇండస్ట్రీలో బన్నీ అత్యంత క్లోజ్‌గా ఉండే అందరి గురించి అడిగారు. పవన్ కళ్యాణ్, ప్రభాస్, మహేష్ బాబు సహా మరికొందరి గురించి అడిగారు. దానికి బన్నీ అదిరిపోయే విధంగా సమాధానాలు చెప్పాడు. కానీ ఎన్టీఆర్ గురించి మాత్రం బాలయ్య బాబు ఒక్క మాట కూడా అడగలేదు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు. 

Also Read :  వదిన అక్రమ సంబంధానికి మరదలు బలి.. ఇదో దుర్మార్గపు క్రైమ్ కథ!

ఏదో ఒక నిమిషంలో బాలయ్య అడగకపోయినా.. బన్నీ అయినా ఎన్టీఆర్ గురించి చెప్తారేమో అని ఫ్యాన్స్ ఎదురుచూశారు. కానీ వారి ఆశలు నిరాశలయ్యాయి. ఇక బన్నీ చెప్పిన మాటలను కట్ చేసి వారి ఫ్యాన్స్ సోషల్ మీడియాల్లో, స్టేటసల్లో పెట్టుకుంటున్నారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఆవేదనతో కామెంట్లు చేస్తున్నారు. ఎందుకు బాలయ్య ఇలా చేశావ్.. ఒక్కసారి అయినా ఎన్టీఆర్ గురించి అడగాలనిపించలేదా అంటూ సోషల్ మీడియా ద్వారా కామెంట్లు పెడుతున్నారు.  

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Hit 3 Movie Second Song: అర్జున్ సర్కార్ కొత్త సాంగ్ ఊరమాస్.. ‘హిట్ 3’ సెకండ్ సింగిల్ కెవ్ కేక

నేచురల్ స్టార్ నాని నటిస్తోన్న కొత్త సినిమా ‘హిట్ 3’. శైలేష్ కొలను దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ట్రీట్ అందించారు. ఇందులోని సెకండ్ సింగిల్‌ను విడుదల చేశారు. ‘అబ్కీ బార్ అర్జున్ సర్కార్’ అంటూ ఈ సాంగ్ సాగుతుంది.

New Update
Abki Baar Arjun Sarkaar Lyrical song released

Abki Baar Arjun Sarkaar Lyrical song released Photograph: (Abki Baar Arjun Sarkaar Lyrical song released)

నేచురల్ స్టార్ నాని నటిస్తోన్న కొత్త సినిమా ‘హిట్ 3’. శైలేష్ కొలను దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ట్రీట్ అందించారు. ఇందులోని సెకండ్ సింగిల్‌ను విడుదల చేశారు. ‘అబ్కీ బార్ అర్జున్ సర్కార్’ అంటూ ఈ సాంగ్ సాగుతుంది.

Advertisment
Advertisment
Advertisment