This Week Ott Movies: వేసవి వినోదాన్ని అందించేందుకు ఈ వారం పలు సినిమాలు, సీరీస్ లు సిద్ధమయ్యాయి. అయితే అన్ని చిన్న చిత్రాలే బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. ఈ వారం ఓటీటీ, థియేటర్ సినిమాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
ఈ వారం ఓటీటీ, థియేటర్ సినిమాలు
'28 డిగ్రీస్ సెల్సియస్'
పొలిమేర సీరీస్ ఫేమ్ డాక్టర్ అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ '28 డిగ్రీస్ సెల్సియస్'. ఈ చిత్రం ఏప్రిల్ 4న థియేటర్స్ లో విడుదల కానుంది. నవీన్ చంద్ర, ప్రియదర్శి, వైవా హర్ష, షాలిని తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు.
Aditya 369
అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచిన బాలయ్య సైన్స్ ఫిక్షన్ డ్రామా 'Aditya 369' ఏప్రిల్ 4న రీరిలీజ్ కానుంది. శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలకృష్ణ హీరోగా నటించగా.. తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్, బ్రహ్మానందం, బాబు మోహన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
శారీ
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కథతో గిరికృష్ణ కమల్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ 'శారీ'. సత్య యాదు, ఆరాధ్యదేవి ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఏప్రిల్ 4న తెలుగుతోపాటు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది.
వృషభ
అశ్విన్ కామరాజ్ కొప్పల దర్శకత్వంలో జీవన్, అలేఖ్య జంటగా నటించిన 'వృషభం' మూవీ ఏప్రిల్ 4న విడుదల కానుంది. 1966–1990 నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు.
టెస్ట్
నయనతార, సిద్దార్థ్, మీరా జాస్మిన్, మాధవన్ ప్రధాన పాత్రలో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ 'టెస్ట్' ఏప్రిల్ 4న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది.
నెట్ ఫ్లిక్స్
- కర్మ: ఏప్రిల్ 04
- పల్స్: ఏప్రిల్ 03
- టెస్ట్: ఏప్రిల్ 04
జీ5
- కింగ్‌స్టన్: ఏప్రిల్ 4
ఆహా
- హోం టౌన్: ఏప్రిల్ 4
జియో హాట్‌స్టార్
- టచ్ మి నాట్: ఏప్రిల్ 04
- హైపర్ నైఫ్ (కొరియన్ సీరీస్): ఏప్రిల్ 02
- బ్రిలియంట్ మైండ్స్ : ఏప్రిల్ 05
cinema-news | this-week-ott-movies
Also Read: Janhvi Kapoor: సూట్ విప్పి.. ర్యాంప్ పై అదరగొట్టిన జాన్వీ.. నడుస్తుంటే మామూలుగా లేదుగా! వీడియో వైరల్