/rtv/media/media_files/2025/02/13/iZcO9MXDfOou58X4jXMM.jpg)
aishwarya rajesh
నటి ఐశ్వర్య రాజేశ్ పేరు మారుమోగుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో వెంకటేష్ సరసన నటించింది. ఇందులో అతడి భార్యగా మెప్పించింది. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దాదాపు రూ.300 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.
షాకింగ్ విషయాలు
ఇదిలా ఉంటే నటి ఐశ్వర్య రాజేశ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలు వెల్లడించింది. ఇప్పటి వరకు తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ కెరీర్‌లో ఎదుర్కొన్న ఎన్నో విషయాలను ఆమె పంచుకున్నారు. తనకు గతంలో రిలేషన్‌షిప్ ఉండేదని.. అతడి నుంచి ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నానని తెలిపారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ..
ఇది కూడా చదవండి: ఏసీబీ వలలో అవినీతి తిమింగలం.. దుబ్బాక రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ అరెస్ట్
అమ్మే స్ఫూర్తి
తన అమ్మే తనకు ఎంతో స్ఫూర్తి అని అన్నారు. తమ తల్లి దండ్రులకు నలుగురు సంతానమని.. ఇక చిన్న తనంలోనే తండ్రి చనిపోయాడని తెలిపారు. అప్పటి నుంచి తమను అమ్మే ఎంతో కష్టపడి పెంచిందని.. ఆ ప్రయాణంలో ఆమె మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొందని వెల్లడించారు. ఆ టైంలో తన తల్లికి అండగా ఉండాలనే ఉద్దేశంతోనే చిన్నతనంలో పార్ట్ టైం జాబ్ చేసినట్లు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: కేరళ నర్సింగ్ కాలేజీ ర్యాగింగ్ కేసులో ఐదుగురు విద్యార్థులు అరెస్ట్
అలా స్వతహాగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. వచ్చిన ప్రతి అవకాశాన్ని వదులుకోకుండా ఈ స్థాయికి వచ్చానని.. దీనికి తాను ఎంతగానో గర్వపడుతున్నానని తెలిపారు. అనంతరం తన రిలేషన్ గురించి షాకింగ్ వ్యాఖ్యలు వెల్లడించారు. గతంలో తాను రిలేషన్‌లో ఉన్నానని అన్నారు.
ఇది కూడా చదవండి: రామరాజ్యం ఆర్మీ పేరుతో అరాచకాలు.. వీరరాఘవరెడ్డి బాగోతం బయటపెట్టిన RTV!
అతడు నన్ను వేధించాడు
సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో ఓ వ్యక్తితో ప్రేమలో పడ్డానని.. ఆ సమయంలో అతడి నుంచి వేధింపులు ఎదుర్కున్నానని చెప్పారు. అది మాత్రమే కాకుండా.. దాని కంటే ముందు కూడా అలాంటి ప్రేమనే చూశానని అన్నారు. అందువల్ల గతాన్ని తలచుకుని ఇప్పుడు ప్రేమలో పడాలంటేనే భయమేస్తోందని.. ఎంతగానో ఆలోచించాల్సి వస్తోందని అన్నారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.