నేడు బుట్ట బొమ్మ పూజా హెగ్డే బర్త్‌డే.. ఆమె గురించి ఈ విషయాలు తెలుసా?

ఒకప్పుడు టాలీవుడ్‌ను ఒక ఊపు ఊపిన బుట్ట బొమ్మ పూజా హెగ్డే పుట్టిన రోజు నేడు. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన ఈ మంగుళూరు భామ ప్రస్తుతం తెలుగులో ఒక్క సినిమాకి కూడా సైన్ చేయలేదు.

author-image
By Kusuma
New Update
pooja

ఒకప్పుడు టాలీవుడ్‌ను ఒక ఊపు ఊపిన హీరోయిన్ పూజా హెగ్డే. మోడలింగ్‌తో కెరీర్‌ను ప్రారంభించిన బుట్ట బొమ్మ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్‌లోని టాప్ హీరోలందరి సరసన దాదాపుగా ఆమె నటించింది. నాగచైతన్య హీరోగా నటించిన ఒక లైలా కోసం సినిమాతో పూజా హెగ్డే టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మకుంద సినిమాలో నటించిన ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. 

ఇది కూడా చూడండి:  దేవరగట్టు కర్రల సమరం.. 70 మందికి పైగా గాయాలు

అరవింత సమేతతో..

అల్లు అర్జున్‌ నటించిన డీజే సినిమా హిట్ కావడంతో బుట్ట బొమ్మకి ఒక్కసారిగా హైప్ పెరిగింది. ఆ తర్వాత వరుస సినిమాలతో మహేష్ బాబుతో మహర్షి, ఎన్టీఆర్ సరసన అరవింద సమేతలో నటించింది. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ కావడంతో ఆమెకు ఒక్కసారిగా స్టార్‌డమ్ వచ్చేసింది. ఆ తర్వాత అల్లు అర్జున్‌తో అలా వైకుంఠపురం సినిమాల్లో నటించి సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలో బుట్ట బొమ్మ పాట ఆమెకు మంచి హిట్ ఇచ్చిందనే అనాలి. వీటి తర్వాత ప్రభాస్ సరసన కూడా రాధే శ్యామ్‌లో నటించారు. కానీ ఆశించినంత స్థాయిలో సినిమా లేదు. దీంతో వరుసగా ఫ్లాపులతో బుట్టబొమ్మ వెనుకపడింది.

ఇది కూడా చూడండి: SiddiKhi:షారుఖ్ -సల్మాన్ మధ్య గొడవను సాల్వ్ చేసిన బాబా సిద్ధిఖీ..!

తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా వెలుగు ఎలిగిన బుట్ట బొమ్మ ఒక్కసారిగా మాయమైపోయింది. చేతినిండా సినిమా అవకాశాలతో ఉన్న ఈమె అప్పుడప్పడు సినిమాలతో కనిపించింది. ఆ సినిమాలు కూడా ఈమెకు డిజాస్టర్‌నే మిగిల్చాయి. రాధే శ్యామ్ నుంచి చూసుకుంటే ఆచార్య, బీస్ట్, సర్కస్, కిసీ కా భాయ్ కిసీ కి జాన్ వంటి సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలవడంతో ఈమె ఇండస్ట్రీకి దూరంగానే ఉన్నారు. ప్రస్తుతం స్టార్ హీరో దళపతి విజయ్‌తో ఓ సినిమా చేస్తోంది.  వరుస ఫ్లాప్‌లతో ఉన్న ఈ మంగుళూరు భామ ఈ సారి హిట్ కోసం ప్రయ్నతిస్తోంది. అయితే భారీగా రెమ్యునరేషన్ తీసుకునే ఈ భామ.. ప్రస్తుతం తగ్గించేసిందని టాక్ వినిపిస్తోంది. హిందీ, తమిళంలో సినిమాలు చేస్తున్న ఈ భామ ప్రస్తుతం ఒక్క తెలుగు సినిమాకి కూడా సైన్ చేయలేదు. 

ఇది కూడా చూడండి: భారత్ సెమీస్‌కు చేరాలంటే.. ఆసీస్‌పై తప్పకుండా గెలవాల్సిందేనా?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Terror Attack: ఉగ్రదాడిలో 28 మంది మృతి.. తనికెళ్ల భరణి కన్నీటి కవిత

పహల్గాం టెర్రరిస్టు అటాక్‌పై సినీ నటుడు తనికెళ్ల భరణి స్పందించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక కన్నీటి కవితను షేర్ చేసారు. కాశ్మీరంలోనే కుంకం పువ్వెందుకు పూస్తుందో నా కర్ధమైపోయింది! అంటూ ఆ కవిత సాగుతుంది. ప్రస్తుతం అది నెట్టింట వైరల్‌గా మారింది.

New Update
Pahalgam Terror Attack

Pahalgam Terror Attack

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అందమైన ప్రదేశాలను చూసేందుకు వచ్చిన టూరిస్టులపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో దాదాపు 28 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ముస్లిమేతరులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడినట్లు సాక్ష్యులు చెబుతున్నారు. 

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

అమాయక ప్రజల మృతిపై ఇప్పటికే సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, వ్యాపార వేత్తలు సంతాపం తెలిపారు. ఈ చర్యలకు పాల్పడిన వారిని అస్సలు వదలకూడదని.. కఠినంగా శిక్షించాలంటూ భారతీయులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ సీనియర్ యాక్టర్ తనికెళ్ల భరణి స్పందించారు. ఈ మేరకు ఒక కవితతో ఉన్న పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

కన్నీటి కవిత

కాశ్మీరంలోనే కుంకం పువ్వెందుకు పూస్తుందో నా కర్ధమైపోయింది!
అక్కడ ఉన్నట్టుండి పాకే పాకే పసిబిడ్డ నెత్తురు ముద్దై పోతుంది. 

సామగానం చేసే కాశ్మీరీ పండితుల కంఠాల్లోంచి వేదం ఆగి- రుధిరం బైటికొస్తుంది.

అక్కడ రేపు పల్లకీ లెక్కి ఊరేగాల్సిన పెళ్ళికొడుకులు ఇవాళే పాడెక్కుతారు...

ఆ లోయలో హిమాలయాలు సైతం మూర్తీభవించిన వైధవ్యాల్లా ఉంటాయ్

భరతమాత కిరీటం వొరుసుకునీ నిరంతరం అక్కడ నెత్తురోడుతూ ఉంటుంది !

బుద్ధుడు కూడా కళ్ళూ నోరూ మూసుకుని మళ్ళీ అంతర్ముఖుడౌతాడు !!

ఎప్పుడో 40 ఏళ్ళ క్రితం రాసిన కవిత, ఇంకా తడిగానే ఉంది!! అంటూ తనికెళ్ల భరణి ఒక కవితను పంచుకున్నారు. ఇప్పుడది నెట్టింట వైరల్‌గా మారింది. 

 

pahalgam | Pahalgam attack | pahalgam breaking news | tanikella-bharani | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment