2024 సౌత్ సినిమా ఇండస్ట్రీలో పెళ్లి బాజాలు గట్టిగానే మోగాయి. ఈ ఏడాది చాలా మంది సెలెబ్రిటీలు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. హీరోలే కాదు హీరోయిన్లు కూడా బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పారు. కొంతమంది వ్యక్తిగత కారణాల వల్ల విడాకులు తీసుకున్నప్పటికీ, ఈ ఏడాది కొత్త జీవితానికి శ్రీకారం చుట్టారు. ఈ ఇయర్ రెండో పెళ్లి చేసుకున్న సెలెబ్రిటీల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.. సిద్దార్థ్ - అదితి తెలుగు, తమిళ ప్రేక్షకులను రెండు దశాబ్దాలుగా తన సహజమైన నటనతో ఆకట్టుకుంటున్న సిద్ధార్థ్, 2003లో మేఘన అనే యువతిని వివాహం చేసుకున్నాడు. కానీ నాలుగు సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకున్నాడు. 2021 నుంచి అదితి రావు హైదరీతో రిలేషన్ షిప్ లో ఉండి.. ఈ ఏడాది తన ప్రేమను అధికారికంగా ప్రకటించాడు. సెప్టెంబర్‌లో అదితితో వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. అదితి రావు హైదరీకు కూడా ఇది రెండవ వివాహం కావడం గమనార్హం. Also Read: పవన్ ను ఇబ్బంది పెట్టకండి.. ఫ్యాన్స్ కు 'ఓజీ' మేకర్స్ రిక్వెస్ట్ చైతూ - శోభిత అక్కినేని వారసుడైన నాగ చైతన్య కూడా ఈ సంవత్సరం మరోసారి పెళ్లి పీటలెక్కాడు. 2017లో సమంతను వివాహం చేసుకున్న చైతన్య.. వ్యక్తిగత కారణాలతో 2021లో విడిపోయాడు. తర్వాత, 2022లో హీరోయిన్ శోభితా ధూళిపాళతో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వినిపించాయి. ఆ వార్తలకు ముగింపు ఇస్తూ, డిసెంబర్‌లో అన్నపూర్ణ స్టూడియోస్‌లో శోభితను వివాహం చేసుకున్నాడు. క్రిష్ - ప్రీతి వేదం, కంచె, గౌతమీపుత్ర శాతకర్ణి వంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న క్రిష్ జాగర్లమూడి కూడా ఈ ఏడాది కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. 2016లో మొదటి వివాహం చేసుకున్న క్రిష్.. రెండేళ్ల తర్వాత విడాకులు తీసుకున్నాడు. నవంబర్‌లో ప్రముఖ గైనకాలజిస్ట్ ప్రీతి చల్లాను పెళ్లి చేసుకుని రెండవ వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. సాయి కిరణ్ - స్రవంతి ఒకప్పుడు వెండితెరపై హీరోగా తనదైన గుర్తింపును తెచ్చుకున్న నటుడు సాయి కిరణ్ కూడా ఈ ఏడాది రెండో వివాహం చేసుకున్నాడు. 2010లో మొదటి వివాహం చేసుకున్న సాయి కిరణ్, ఆ తరువాత భార్యతో విడిపోయాడు. బుల్లితెరపై "కోయిలమ్మ" సీరియల్‌తో పాపులర్ అయిన స్రవంతితో ప్రేమలో పడి, ఈ సంవత్సరం ఆమెను వివాహం చేసుకున్నాడు. Also Read: యూట్యూబ్ ను షేక్ చేసిన ఏకైక ఇండియన్ సాంగ్..'కుర్చీ మడతపెట్టి' నయా రికార్డ్