Samantha: నాగచైతన్య-శోభిత పెళ్లిపై సమంత షాకింగ్ వ్యాఖ్యలు.. దాన్ని అంగీకరించనంటూ!

తన మాజీ భర్త కొత్త బంధంలోకి అడుగుపెట్టడంపై సమంత తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇలా జరగడాన్ని అసూయగా భావిస్తున్నారా? అనే ప్రశ్నకు సమాధానమిచ్చింది. తన జీవితంలో అసూయకు తావులేదంది. తనలైఫ్‌లో అది భాగం కావడాన్ని అంగీకరించనని తెలిపింది.

New Update
samantha shocking comments on ex partner naga chaitanya and shobitha

samantha shocking comments on ex partner naga chaitanya and shobitha

నాగ చైతన్యతో విడాకుల తర్వాత నటి సమంత ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరికి వాటి నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే పలు సినిమాల్లో నటించి అదరగొడుతున్నారు. అప్పుడప్పుడు తన మాజీ భర్త నాగ చైతన్యపై షాకింగ్ కామెంట్లు చేసి వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. 

Also Read: Delhi: ఢిల్లీ ఎన్నికల పోలింగ్  షురూ..కేజ్రీవాల్ పై హర్యానాలో ఎఫ్ ఐఆర్

తాజాగా మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేసి వార్తల్లోకెక్కింది. తన మాజీ భర్త నాగచైతన్య కొత్త బంధంలోకి అడుగుపెట్టడంపై ఆమె స్పందించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సామ్‌కు రిలేషన్‌షిప్‌ నుంచి బయటకు వచ్చి జీవితంలో ముందుకు సాగడంపై ఓ ప్రశ్న ఎదురైంది. 

Also Read: Cinema: తండేల్ సినిమా టికెట్ల రేట్ల పెంపుకు ఓకే చెప్పిన గవర్నమెంట్

ఎంతగానో శ్రమించాను

దానిపై సామ్ మాట్లాడుతూ.. రిలేషన్‌షిప్ నుంచి బయటకు వచ్చేందుకు ఎంతగానో శ్రమించాను అని తెలిపింది. అనంతరం తన మాజీ పార్ట్‌నర్ కొత్త బంధంలోకి అడుగుపెట్టడం అసూయగా భావిస్తున్నారా? అనే ప్రశ్న ఎదురైంది. దానికి స్పందించిన సామ్.. తన లైఫ్‌లో అసూయకు తావులేదని తెలిపింది. తన జీవితంలో అసూయ అనేది భాగం కావడాన్ని అంగీకరించని పేర్కొంది. 

Also Read: మూడు గ్రూపులుగా ఎస్సీలు.. ఏ కులం ఏ గ్రూపులో ఉందో తెలుసా?.. ఫుల్ లిస్ట్ ఇదే!

పెద్దగా పట్టించుకోను

అంతేకాకుండా అసూయే అన్ని చెడులకు మూలమని తాను భావిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. అందువల్ల అలాంటి వాటి గురించి తాను పెద్దగా పట్టించుకోనని తెలిపింది. దీంతో ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే తన ఎక్స్ పార్ట్‌నర్ గురించి సామ్ షాకింగ్ వ్యాఖ్యలు చేయడం ఇదేం మొదటి సారి కాదు. 

ఇటీవలే సిటడెల్ సిరీస్ ప్రమోషన్లలో చైతన్యను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అవసరం లేకపోయినా.. అత్యధిక మొత్తంలో దేనికోసం ఖర్చుపెట్టారు? అనే ప్రశ్న ఆమెకు ఎదురైంది. దీనిపై స్పందిస్తూ.. తన మాజీకి ఇచ్చిన ఖరీదైన కానుకలు అంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. దాని ధర కూడా చాలా ఎక్కువే అని చెప్పుకొచ్చింది. అప్పట్లో సామ్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు