Prudhvi: కాపాడండయ్య నన్ను.. సైబర్ క్రైమ్‎ను ఆశ్రయించిన పృథ్వీ!

నటుడు పృథ్వీ తాజాగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. వైసీపీ శ్రేణులు రెండు రోజులుగా తనను వేధిస్తున్నారని.. ఫోన్స్, మెసేజ్స్ పెడుతూ టార్చర్ చేస్తున్నారని కుటుంబంతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

New Update
tollywood actor Prudhvi Raj files complaint with cybercrime police against ycp fans (1)

tollywood actor Prudhvi Raj files complaint with cybercrime police against ycp fans

‘లైలా’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో వైసీపీని ఉద్దేశించి నటుడు పృథ్వీ చేసిన వ్యాఖ్యలు నెట్టింట దుమారం రేపాయి. దీంతో రంగంలోకి దిగిన వైసీపీ సోషల్ మీడియా పృథ్వీని టార్గెట్‌గా చేసుకుంది. నెట్టింట అతడిపై రకరకాల పోస్టులు పెడుతోంది. వెంటనే సారీ చెప్పాలని డిమాండ్ చేస్తుంది. కానీ పృథ్వీ మాత్రం వెనక్కి తగ్గకుండా సారీ చెప్పనని.. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ తేల్చి చెప్పాడు. దీంతో వైసీపీ అభిమానులు మరింత రెచ్చిపోవడంతో తట్టుకోలేక చివరకు అతడు తాజాగా పోలీసులను ఆశ్రయించాడు. 

Also Read : ఇది మరీ దారుణం.. రేషన్ కార్డు దరఖాస్తుకు రూ.2వేలు.. మీసేవ సెంటర్ల వసూళ్ల దందా!

టార్చర్ చేస్తున్నారు

పృథ్వీ తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. వైసీపీ శ్రేణులు గత రెండు రోజులుగా తనను వేధిస్తున్నారని.. ఫోన్లు, మెసేజ్‌లతో టార్చర్ చేస్తున్నారని కుటుంబంతో కలిసి వెళ్లి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో తనను ఫోన్లు, మెసేజ్‌లతో అసభ్యంగా దూషిస్తోన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు. 

Also Read: TTD: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఇకపై వాట్సాప్‌లోనే

ల**జకొడ**ల్లారా అనాలి

ఇదిలా ఉంటే తాజాగా వైసీపీ నాయకులపై పృథ్వీ మండిపడ్డారు. ఈ మేరకు హాస్పిటల్ బెడ్‌పై ఉన్న ఆయన వైసీపీ శ్రేణులపై ఫైర్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘11 అనే మాట వింటే గజ గజ వణికిపోతున్నారంటే.. దానికి మేము ఏం చేయలేం.

Also Read: Trump-musk: మస్క్‌ కు హై పవర్‌ ఇచ్చిన ట్రంప్‌...ఇక కోతలే..కోతలు!

నిజంగా నా తల్లి బతికి ఉన్నప్పుడు ఎవడైనా తిడితే.. ఒక్కొక్కడిని నరికేసేవాడిని. ఆమె చనిపోయిందని.. అయినా ఆమె ఆత్మకు శాంతి కూడా లేకుండా చేశారు కదరా దరిద్రపు నా కొ**ల్లార.. మిమ్మల్ని ల**జకొడ**ల్లారా అని అనాలి’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అతడి వ్యాఖ్యలు వైరల్‌గా మారడంతో దీనిపై వైసీపీ సోషల్ మీడియా మరోసారి రెచ్చిపోయింది.

Also Read: Trump-musk: మస్క్‌ కు హై పవర్‌ ఇచ్చిన ట్రంప్‌...ఇక కోతలే..కోతలు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు