/rtv/media/media_files/2025/02/21/H0rMMeFTUjfYU0pRS6Cb.jpg)
The Making of Chhaava
Making of Chhaava: లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో, విక్కీ కౌశల్(Vicky Kaushal) ప్రధాన పాత్రలో నటించిన హిస్టారికల్ యాక్షన్ థ్రిల్లర్ "ఛావా" ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించింది. ముఖ్యంగా శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ కనబరిచిన అభినయం చూసి ప్రేక్షకులు జైజైలు పలికారు. ఈ క్రమంలో చిత్ర బృందం, విక్కీ కౌశల్ పడ్డ కష్టాలను చూపిస్తూ ‘ది మేకింగ్ ఆఫ్ ఎ వారియర్ కింగ్’ అనే వీడియోను విడుదల చేసింది.
Also Read: Pulivendula: పులివెందుల పోలీసులకు కోర్టులో చుక్కెదురు!
ఈ మూవీలో విక్కీ కౌశల్ శంభాజీ మహారాజ్ పాత్రను అద్భుతంగా ప్రదర్శించేందుకు ఆరు నెలలపాటు కఠిన శిక్షణ తీసుకున్నారు. మొదటగా, గుర్రపు స్వారీపై సామర్ధ్యాన్ని పెంచుకోవడానికి ఎంతో శ్రమించారు. ఆపై, యుద్ధం, కత్తిసాము, రాజ్యంలో నేర్చుకోవాల్సిన ప్రతి ఆర్ట్‌ను బాగా నేర్చుకున్నారు. కత్తితో పాటు ఇతర ఆయుధాలను ఎలా ఉపయోగించాలో కూడా యాక్షన్ కొరియోగ్రాఫర్ల సహాయంతో నేర్చుకున్నారు.
Also Read: మహా కుంభమేళా చివరి రోజు ఆకాశంలో అద్భుతం!
ఎనిమిది గంటలపాటు జిమ్ లోనే..
విక్కీ, రోజుకు ఆరు నుండి ఎనిమిది గంటలపాటు శిక్షణ తీసుకునేవాడట, శిక్షణా సమయంలో ఎన్నో గాయాలను భరిస్తూ ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకునేవాడట.
Also Read: మిడిల్ క్లాస్ వారికి చీప్ అండ్ బెస్ట్ స్కూటర్ అంటే ఇదే భయ్యా!
శంభాజీ మహారాజ్ పాత్ర కోసం ఫిజికల్ గా కూడా విక్కీ కౌశల్, తన శరీరానికి కండలు పెంచేందుకు కష్టపడ్డారు. కండలు కలిగిన దేహం కోసం 100 కేజీల బరువు పెరిగి, జిమ్‌లో అనేక గంటలు శ్రమించారు. ఈ శిక్షణ తన జీవితానికి కూడా ఎంతో క్రమశిక్షణ నేర్పించిందని విక్కీ చెప్పుకొచ్చారు..