/rtv/media/media_files/2025/03/02/3Ll1NUheGbWrixjw3Bdx.jpg)
thandel ott streaming
Thandel Ott: చందూ మొండేటి దర్శకత్వంలో సాయి పల్లవి- అక్కినేని నాగచైతన్య జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ 'తండేల్'. గతనెల విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. రూ. 100 కోట్లకు పైగా వసూళ్లతో నాగచైతన్య కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. దివ్య పిళ్ళై, కల్పలత, కళ్యాణి నటరాజన్, ప్రకాష్ బిల్వాడి తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో సక్సెస్ ఫుల్ థియేట్రికల్ రన్ తర్వాత ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది.
Also read : Viral video: పక్కన ఇద్దరుండగానే మూడో వాడికి ముద్దులు.. మద్యం మత్తులో యువతి హల్ చల్!
The #BlockbusterLoveTsunami is hitting your small screens after creating a sensation at the box office ❤️#Thandel streaming on #Netflix from 7th March in Telugu, Hindi, Tamil, Kannada and Malayalam ❤🔥 pic.twitter.com/HrxrbEb0Ar
— Thandel (@ThandelTheMovie) March 2, 2025
తండేల్ ఓటీటీ
మార్చి 7నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి రానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సదరు సంస్థ పోస్టర్ రిలీజ్ చేసింది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోని రానుంది. అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. దేవిశ్రీ సంగీతం అందించారు. అయితే ఈ సినిమాకు దేవి పాటలు మరొక హైలైట్ గా నిలిచాయి. ప్రతీ పాట ఒక చార్ట్ బస్టర్ అయ్యింది. ముఖ్యంగా 'బుజ్జితల్లి' సాంగ్ ఇప్పటికీ యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ తో దుమ్మురేపుతోంది. తాజాగా 100 మిలియన్ వ్యూస్ హిట్ చేసింది.
Also read : Mika Singh: అందుకే వాళ్లకు ఆ గతి పట్టింది.. బిపాసా దంపతులపై ప్రముఖ సింగర్ షాకింగ్ కామెంట్స్!