/rtv/media/media_files/2025/02/23/j4c6O5f4zskbxqQdo71u.jpg)
Thalapathy Vijay
Thalapathy Vijay: దళపతి విజయ్ తన 69వ సినిమాకు ‘జననాయగన్’(Jana Nayagan) అనే టైటిల్‌ను ప్రకటించారు. ఈ సినిమాను కర్ణాటకలోని ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్ నిర్మిస్తోంది. ఇది ఆయన చివరి సినిమా అని ఆయన స్వయంగా వెల్లడించారు. విజయ్ ఇప్పటికే రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి, త్వరలోనే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.
Also Read: మైనర్ బాలికలు శృంగారం చేస్తే తప్పుకాదు.. హైకోర్టు సంచలన వ్యాఖ్యలు!
ప్రస్తుతం, విజయ్ 'జననాయగన్' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాను పూర్తి చేసిన తరువాత, ఆయన పూర్తిగా రాజకీయాల్లోకి గడుపుతారని కోలీవుడ్ వర్గాల్లో చర్చలు జరుగుతోంది. అయితే విజయ్ తమిళనాడు విక్టరీ పార్టీ ప్రధాన కార్యదర్శి పుస్సీ ఆనంద్ తో కలిసి బిజీ షెడ్యూల్ మధ్యలో ఒక రోజు తన లగ్జరీ కారును డ్రైవ్ కోసం తీసుకెళ్లారు.
Also Read: సీఎం రేవంత్‌కు రాహుల్ గాంధీ ఫోన్.. SLBC ఘటనపై ఏం చెప్పారంటే!
విజయ్ వీడియో వైరల్..!
అదే సమయంలో ఒక సంఘటన చోటు చేసుకుంది, విజయ్ ని చూసిన అభిమానులు ఒక్కసారిగా తన కార్ ను ఫాలో అయ్యారు. తన కార్ చుట్టూ ఉన్న అభిమానుల్ని చూడటానికి విజయ్ కాసేపు కారులో ఆగి, వారికి హలో చెబుతూ చేతులు ఊపుతూ పలకరించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిత్రీకరణ పూర్తయిన తర్వాత, విజయ్ తన కారులో బయటకు వెళ్తుంటారు. ఆ సమయంలోనే , కొంతమంది అభిమానులు విజయ్ కారును వెంబడించడం జరిగింది.
Thalapathy @actorvijay was spotted driving his car post #Jananayagan shoot 🎥 pic.twitter.com/oHySX1uDYI
— Vijay Fans Trends (@VijayFansTrends) February 17, 2025
Also Read: MLC ఎన్నికలకు దూరం.. మంత్రి శ్రీధర్ బాబు సంచలన ప్రకటన!
విజయ్ ప్రస్తుతం చేస్తున్న 'జననాయగన్' మూవీకు హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఒక రాజకీయ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ సినిమా తరువాత, విజయ్ తన సినిమా కెరీర్‌కు గుడ్‌బై చెప్పి, పూర్తిగా రాజకీయ రంగంలో పాల్గొననున్నాడు.