TG Govt: టాలీవుడ్ కు రేవంత్ సర్కార్ బిగ్ షాక్.. ఇక వాటికి నో పర్మిషన్

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై తెలంగాణలో ఎలాంటి బెనిఫిట్ షోలకు, టికెట్ రేట్లు పెంచుకోవడానికి ఎలాంటి అనుమతి ఇవ్వమని తాజాగా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తో పాటూ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం స్పష్టం చేశారు.

New Update
revanth12

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై తెలంగాణలో ఎలాంటి బెనిఫిట్ షోలకు, టికెట్ రేట్లు పెంచుకోవడానికి ఎలాంటి అనుమతి ఇవ్వమని తాజాగా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తో పాటూ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశంలో భాగంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..' సినిమా వాళ్లకు చెప్పేది ఒకటే. మీరు సినిమా తీయండి. బిజినెస్ చేసుకోండి, షూటింగ్ కోసం ఎలాంటి పర్మిషన్  ప్రభుత్వం నుంచి సాయం పొందండి. కానీ ఈ సినిమా వల్ల ఒక ప్రాణం పోయింది. అందుకే ఇప్పటి నుంచి సినిమా వాళ్లకు మా ప్రభుత్వం ఎలాంటి అనుమతులు ఇవ్వదు.. అని అన్నారు.

Revanth Reddy Gives Big Shock To Tollywood

Also Read :  చీరలో అబ్బా అనిపిస్తున్న హెబ్బా.. ముసిముసి నవ్వులు చిందిస్తూ

Also Read :   లవర్ కోసం 3 మహా సముద్రాలు దాటిన మగ తిమింగలం.. ఈ కథ వింటే మీరూ ప్రేమలో పడతారు

ఇటీవల అల్లు అర్జున్ హీరోగా నటించిన 'పుష్ప2' ప్రీమియర్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళా మృతి చెందింది. ఆమె కొడుకు హాస్పిటల్ లో చావు బతుకుల మధ్య ఉన్నాడు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఇదే ఘటనలో అల్లు అర్జున్ ఓకే రోజు జైలుకు కూడా వెళ్ళొచ్చాడు. మరోసారి ఇలాంటి ఘటనలు జరక్కుండా ఉండేందుకే తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Also Read :  'పుష్ప2' ఓటీటీ రిలీజ్ పై మేకర్స్ క్లారిటీ.. థియేటర్స్ లో మాత్రమే అంటూ

Also Read :  పెళ్లి తర్వాత 'బేబీ జాన్' తో బిజీ.. సోషల్ మీడియాలో కీర్తి ఫొటోలు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Arjun Son Of Vyjayanthi Trailer: కల్యాణ్‌రామ్‌ ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ ట్రైలర్‌ చూశారా? కెవ్ కేక

కళ్యాణ్ రామ్ కొత్త సినిమా అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ అత్యంత ఉత్కంఠభరింతగా ఉంది. యాక్షన్, రొమాన్స్, సాంగ్స్ ఇలా ప్రతి విషయంలోనూ కట్ చేసిన ట్రైలర్ అభిమానుల్ని, ప్రేక్షకుల్ని అలరిస్తుంది.

New Update
Arjun Son Of Vyjayanthi Trailer | Nandamuri Kalyan Ram | Vijayashanti

Arjun Son Of Vyjayanthi Trailer | Nandamuri Kalyan Ram

నందమూరి కల్యాణ్‌రామ్‌, విజయశాంతి తల్లీకొడుకులుగా నటించిన కొత్త సినిమా ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’. సయీ మంజ్రేకర్‌ ఇందులో హీరోయిన్‌‌గా నటిస్తోంది. కొత్త దర్శకుడు ప్రదీప్‌ చిలుకూరి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాడు. ఈ సినిమా ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ తరుణంలో మేకర్స్ అదిరిపోయే సర్ ప్రైజ్ అందించారు.

ట్రైలర్ అదుర్స్

ఇవాళ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో భాగంగా ట్రైలర్‌ విడుదల చేశారు. ఫుల్ యాక్షన్‌ సన్నివేశాలతో ఈ ట్రైలర్ అదిరిపోయింది. టైటిల్‌కు తగ్గట్లుగా తల్లీకొడుకుల అనుబంధానికి ఎంతో ప్రాధాన్యమున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. మరెందుకు ఆలస్యం మీరు కూడా ట్రైలర్ చూసి ఎంజాయ్ చేయండి. 

(Arjun Son Of Vyjayanthi)

Advertisment
Advertisment
Advertisment