Betting App Case: బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో యాంకర్ విష్ణుప్రియతో పాటు మరో 11 మంది సెలెబ్రెటీలకు పంజాగుట్ట పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే విష్ణుప్రియ పలు మార్లు విచారణకు హాజరైంది. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ హైకోర్టు ఆమెకు షాకిచ్చింది. ఇటీవలే విష్ణుప్రియ తనపై నమోదైన ఎఫ్ఐఆర్ లను కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయగా.. నేడు దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఎఫ్ఐఆర్ లను కొట్టివేసేందుకు నిరాకరించింది. అలాగే విచారణలో పోలీసులకు సహకరించాలని ఆదేశించింది.
Also Read: NTR Japan Fan: ఇదేం క్రేజ్ రా బాబు.. NTRతో గలగలా తెలుగు మాట్లాడిన జపాన్ ఫ్యాన్.. వీడియో వైరల్!
ఈనెల 20న విచారణకు
ఇదిలా ఉంటే ఈనెల 20న విష్ణుప్రియ తన లాయర్‌తో కలిసి పంజాగుట్ట పీఎస్ కు విచారణకు హాజరయ్యారు. ముఖం కనిపించకుండా తలకు స్కార్ఫ్ తో విష్ణుప్రియ విచారణకు హాజరయ్యారు. దాదాపు 11 గంటల పాటు విష్ణుప్రియను పోలీసులు విచారించారు. విచారణలో ఆమె బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేశానని ఒప్పుకున్నారు. 3 యాప్స్‌కు తాను ప్రమోషన్స్ చేశానని విచారణలో చెప్పుకొచ్చారు. దీంతో 25వ తేదీన పోలీసులు మరోసారి విచారణకు హాజరుకావాలని చెప్పారు. ఈ క్రమంలోనే కోర్టు ఆమెకు మరో షాకిచ్చింది.
బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు చేసిన సెలెబ్రెటీలకు చుక్కలు చూపిస్తున్నారు తెలంగాణ పోలీసులు. స్టార్ హీరోల నుంచు సామాన్యల వరకు ఎవరినీ వదిలిపెట్టడంలేదు. ఒకరి తర్వాత ఒకరిపై కేసులు నమోదు చేస్తున్నారు. హీరో రానా, విజయ దేవరకొండలపై కూడా బెట్టింగ్ ప్రమోషన్స్ ఆరోపణలు వచ్చాయి. రోజురోజుకు బెట్టింగ్ యాప్ ల విషయం సీరియస్ అవుతుండడంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బెట్టింగ్ యాప్ కేసులను సీఏడీకి బదిలీ చేయాలని నిర్ణయించింది.
vishnu priya betting case | latest-news | cinema-news
Also Read: NTR Japan Fan: ఇదేం క్రేజ్ రా బాబు.. NTRతో గలగలా తెలుగు మాట్లాడిన జపాన్ ఫ్యాన్.. వీడియో వైరల్!