Tamannaah Bhatia: విజయ్ వర్మతో బిల్క్ బ్యూటీ బ్రేకప్.. సెన్సేషనల్ కామెంట్స్ చేసిన తమన్నా

ప్రేమ విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని తమన్నా భాటియా ఇటీవల ఓ పాడ్ కాస్ట్ ద్వారా తెలిపింది. ప్రేమలో స్వేచ్ఛ ఉండాలని, కండిషన్స్ పెట్టడం లవ్ కాదని.. బిజినెస్ వంటిదని వెల్లడించింది. సరిగ్గా ఆలోచించి పార్ట్‌నర్‌ను సెలక్ట్ చేసుకోవాలని తెలిపింది.

New Update

నటుడు విజయ్ వర్మ, తమన్నా లవ్ బ్రేకప్ అయినట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. గత కొన్నాళ్ల నుంచి రిలేషన్‌లో వీరిద్దరు త్వరలో పెళ్లి కూడా చేసుకుంటారని జోరుగా ప్రచారం సాగింది. కానీ ఇంతలోనే ఇద్దరికి అభిప్రాయ భేదాలు రావడంతో విడిపోయినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా తమన్నా ఓ పాడ్ కాస్ట్‌లో లవ్, రిలేషన్‌షిప్ గురించి చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చూడండి: AP News: మగవారికంటే మహిళలే మెరుగ్గా రానిస్తున్నారు.. చంద్రబాబు సంచలన కామెంట్స్!

నచ్చినట్లు పార్ట్‌నర్ ఉండాలని..

ప్రేమ, రిలేషన్‌‌‌‌‌‌‌‌ విషయంలో చాలామంది అయోమయం అవుతుంటారు.. కానీ ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉందని తమన్నా తెలిపింది. లవ్ అనేది ఎప్పుడూ కూడా అన్‌‌‌‌‌‌‌‌కండిషనల్‌‌‌‌‌‌‌‌గా ఉండాలి. ప్రేమను ఫీల్ అవ్వాలని తమన్నా తెలిపింది. మనకి నచ్చినట్లు పార్టనర్ ఉండాలని రూల్స్ ఉండకూడదు. మనకి నచ్చినట్లు ఉండాలని, మనం చెప్పిందే చేయాలని కండిషన్స్ పెట్టడం లవ్ కాదని.. బిజినెస్ వంటిదని తెలిపింది. 

ఇది కూడా చూడండి: You Tube: యూట్యూబ్ నుంచి 95లక్షల వీడియోలు, 45 లక్షల ఛానెళ్ళు తొలగింపు

తాను ఎవరిని ప్రేమించినా కూడా స్వేచ్ఛగా ఉండనిస్తానని తెలిపింది. సింగిల్ కంటే రిలేషన్‌లో ఉన్నప్పుడే ఎక్కువ హ్యాపీగా ఉన్నట్లు వెల్లడించింది. అలాగే సరైన పార్ట్‌నర్‌ను ఎంచుకోవాలని తెలిపింది. ఎందుకంటే తల్లిదండ్రులను ఎంపిక చేసుకోలేరు.. కానీ స్నేహితులు, పార్ట్‌నర్‌ను మనమే ఎంచుకోవాలని తమన్నా పాడ్ కాస్ట్‌లో తెలిపింది. అయితే పెళ్లి విషయంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడం వల్ల బ్రేకప్ చేసుకున్నట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చూడండి: HYD NEWS: ఘోర రోడ్డు ప్రమాదం.. మాజీ ఎమ్మెల్యే తీగల మనువడు దుర్మరణం

ఇది కూడా చూడండి: Priyanka Chopra: అమ్మకానికి ప్రియాంక ఆస్తులు.. కోట్లలో డిమాండ్.. అదిమాత్రం చాలా కాస్ట్‌లీ!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు