/rtv/media/media_files/2025/02/24/QSaHceuc3WMmccIxK0VD.jpg)
Raja Saab Latest Updates
Raja Saab Latest Updates: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజాగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898AD’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు, ఈ సినిమా బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా 2000 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి, బాక్స్ ఆఫీస్ రికార్డులు కొల్లకొట్టింది. ప్రస్తుతం, ప్రభాస్ తన నెక్స్ట్ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టాడు.
Also Read: Tamilanadu: నటి పై రాజకీయ నేత అత్యాచారం.. ఏడుసార్లు అబార్షన్..కోర్టు సంచలన తీర్పు!
ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్టుల్లో నెక్స్ట్ రాబోతుంది ‘ది రాజా సాబ్’ (The Raja Saab). మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా హారర్ కామెడీ జోనర్‌లో ఉంటుంది. ప్రభాస్ ఫన్ అండ్ ఫామిలీ ఎంటర్టైనర్స్ చేసి చాలా కాలమే అయింది. ఈ సినిమాతో ప్రభాస్ కొత్తగా ఓ కొత్త జానర్‌ను ఫస్ట్ టైం టచ్ చేయబోతున్నాడు.
కోలీవుడ్ నటులు యోగిబాబు, వీటీవీ గణేష్ కూడా..
అయితే ఈ మూవీ గురించి ఇప్పుడు ఒక హాట్ న్యూస్ చక్కర్లు కొడుతోంది, మారుతీ సినిమా అనగానే కమెడియన్స్ కి ఎక్కువ స్కోప్ ఉంటుంది ఎక్కువ శాతం అందరూ కమెడియన్స్ కనిపిస్తుంటారు. తాజా సమాచారం ప్రకారం రాజాసాబ్ మూవీలో కూడా బ్రహ్మానందం, అలీ, వెన్నెల కిషోర్, సప్తగిరి, గెటప్ శ్రీను వంటి సీనియర్, యంగ్ కమెడియన్స్‌తో పాటు కోలీవుడ్ నటులు యోగిబాబు, వీటీవీ గణేష్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ స్టార్ కమెడియన్స్ కోసం సెపరేట్ గా ట్రాక్స్ కూడా రెడీ చేస్తునట్టు తెలుస్తోంది. కథకి అనుగుణంగా అన్ని పాత్రలతో నవ్వులు పూయించేలా ప్లాన్ చేస్తున్నాడట మారుతి. ఇంతమంది స్టార్ కమెడియన్స్ ని పెట్టుకొని మారుతీ ఈసారి ఏం మ్యాజిక్ చేస్తాడో చూడాలి మరి. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ప్రభాస్ అభిమానులు ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు.
Also Read: Champions Trophy: ఎడారి దేశంలో...దాయాది పోరులో రికార్డుల మోత