/rtv/media/media_files/2025/02/03/JrUPpxVU7wM2wK0tCK9g.jpg)
masthan sai, lavanya
మస్తాన్‌సాయి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. మస్తాన్‌సాయి, అతడి స్నేహితుడు ఖాజాకు డ్రగ్స్ పాజిటివ్ నిర్ధారణ అయింది. డ్రగ్స్ మత్తులో మస్తాన్‌సాయి .. లావణ్య ఇంటికి వెళ్లి గొడవ చేసినట్లుగా పోలీసులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. అంతేకాకుండా మస్తాన్‌సాయి .. లావణ్యకు ఉన్న గొడవలను హీరో రాజ్ తరుణ్ దగ్గరుండి సయోధ్య కుదిర్చినట్లుగా పేర్కొన్నారు.
మస్తాన్‌సాయి లాప్‌టాప్‌లో లావణ్య వీడియోలు రాజ్‌తరుణ్ గతంలో తొలగించగా.. రాజ్‌తరుణ్ డిలిట్ చేసేలోపే ఆ వీడియోలు మస్తాన్‌సాయి కాపీ చేసుకున్నట్లుగా వెల్లడించారు. హార్డ్‌డిస్క్ కోసం లావణ్యను చంపేందుకు పలుమార్లు మస్తాన్‌సాయి యత్నించినట్లుగా పోలీసులు రిమాండ్ రిపోర్టులో పొందుపరిచారు. ఈ నేపథ్యంలో మస్తాన్ సాయి పై ఎన్‌డీపీఎస్ సెక్షన్ ను కూడా జోడించారు పోలీసులు.
అమాయకపు అమ్మాయిలను ట్రాప్ చేసి లైంగిక వాంఛలు తీర్చుకుంటూ బెదిరింపులకు పాల్పడుతున్నడంటూ లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి మస్తాన్‌సాయితో పాటుగా ఖాజాను అరెస్ట్ చేశారు. అతడికి సంబంధించిన హార్డ్ డిస్క్‌ను స్వాధీనం చేసుకుని లోతుగా దర్యాఫ్తు చేస్తున్నారు. 2023లో మస్తాన్ సాయి సోదరి వివాహానికి గుంటూరుకు వెళ్లిన లావణ్య బట్టలు మార్చుకున్న సమయంలో మస్తాన్ సాయి వీడియో రికార్డ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆ వీడియోలను చూపించి లావణ్యను శారీరకంగా, లైంగికంగా వేధించాడని తెలుస్తోంది.
మస్తాన్ సాయి వివరణ మరోలా
అయితే లావణ్య ఆరోపణలపై మస్తాన్ సాయి వివరణ మరోలా ఉంది. లావణ్య చెబుతున్న ఆ వీడియోలలో ఉన్నది తన భార్య, గర్ల్ ఫ్రెండ్ అని చెప్పుకొచ్చాడు.. కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వాపోయాడు. అవి 2017లో హనీమూన్ కు వెళ్లినప్పుడు తీసుకున్న వీడియోలని.. ఇప్పుడు ఉన్న హార్డ్ డిస్క్‌లో లావణ్యకు సంబంధించిన యాంటీ ఎవిడెన్స్ ఉన్నాయని తెలిపాడు. వాటిని మాయం చేసేందుకు లావణ్య హార్డ్ డిస్క్ ను దొంగిలించిందని మస్తాన్ సాయి ఆరోపించాడు. వాటిని తన వద్ద పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తుందన్నాడు మస్తాన్ సాయి. అతని హార్డ్ డిస్క్ లో 200కు పైగా నగ్న వీడియోలు ఉన్నాయని, ఇందులో సినిమా రంగానికి చెందిన వారి వీడియోలు కూడా ఉన్నాయని లావణ్య ఆరోపించడం ఇప్పుడు ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది.
Also Read : బెజవాడలో రెచ్చిపోయిన బ్లేడ్ బ్యాచ్.. బైక్‌పై వెళ్తున్న వారి గొంతులు కోసి..!