Ashu Reddy : జాతకాలు కుదిరాయి.. కానీ పెళ్లి క్యాన్సల్! అషురెడ్డి కేసులో దిమ్మతిరిగే నిజాలు!

సోషల్ మీడియా స్టార్, నటి అషురెడ్డి చుట్టూ పెళ్లి పేరుతో భారీ మోసం చేశారనే ఆరోపణలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. వివాహం చేసుకుంటానని నమ్మించి కోట్లాది రూపాయలు కాజేశారంటూ నమోదైన ఈ కేసులో దిమ్మతిరిగే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. 

New Update
ashu reddy case

సోషల్ మీడియా స్టార్, నటి అషురెడ్డి చుట్టూ పెళ్లి పేరుతో భారీ మోసం చేశారనే ఆరోపణలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. వివాహం చేసుకుంటానని నమ్మించి కోట్లాది రూపాయలు కాజేశారంటూ నమోదైన ఈ కేసులో దిమ్మతిరిగే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. 

ఇంతకు ఏం జరిగిందంటే.. పెళ్లి పేరుతో అషురెడ్డి తనను మోసం చేసి, ఏకంగా రూ. 9.35 కోట్లు వసూలు చేసిందంటూ ధర్మేంద్ర అనే వ్యక్తి తండ్రి సత్యనారాయణ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమారుడు ధర్మేంద్రతో పెళ్లికి అషురెడ్డి అంగీకరించిందని, ఆ నమ్మకంతోనే అడిగినప్పుడల్లా భారీ మొత్తంలో డబ్బులు ఇచ్చుకుంటూ వెళ్ళామని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేవలం అషురెడ్డికే కాకుండా, ఆమె సోదరి దివ్యారెడ్డికి కూడా రూ. 50 లక్షలు ఇచ్చినట్లు బాధితులు వెల్లడించారు.

ఈ వివాహానికి సంబంధించి ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి వద్ద వీరిద్దరి జాతకాలను కూడా చూపించుకున్నట్లు సమాచారం. జాతకాలు కుదిరాయని, పెళ్లి చేసుకుంటే మంచిదని ఆయన చెప్పడంతో ఇరు కుటుంబాలు పెళ్లికి పచ్చజెండా ఊపాయి. ఈ క్రమంలోనే ధర్మేంద్ర, అషురెడ్డి కుటుంబాల మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అషురెడ్డి కూడా పెళ్లి చేసుకుంటానని నమ్మబలకడంతో ధర్మేంద్ర ఆమె అవసరాలకు తగినట్లుగా కోట్లాది రూపాయలను ధారపోశారు.

అయితే అంతా సవ్యంగా సాగుతుందనుకున్న సమయంలో అషురెడ్డి అనూహ్యంగా పెళ్లికి నిరాకరించినట్లు సత్యనారాయణ ఆరోపిస్తున్నారు. పెళ్లి వద్దని చెప్పడంతో, తాము ఇచ్చిన డబ్బును తిరిగి ఇవ్వాలని ధర్మేంద్ర డిమాండ్ చేశారు. ఆ సమయంలో డబ్బు తిరిగి ఇవ్వలేక, పెళ్లి చేసుకుంటానని అషురెడ్డి హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు మాట మార్చి రిటర్న్‌లో తమపైనే కేసు పెడతానంటూ బెదిరింపులకు దిగుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అషురెడ్డి తన బాయ్‌ఫ్రెండ్ జయంత్‌తో కలిసి ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపిందని, పక్కా ప్లాన్ ప్రకారం తమను మోసం చేసిందని సత్యనారాయణ ఫిర్యాదులో పేర్కొన్నారు. కేవలం డబ్బు కోసమే పెళ్లి నాటకం ఆడి, ఇప్పుడు అడిగితే తప్పుడు కేసులు పెడతానని భయపెడుతున్నారని ఆయన పోలీసులకు వివరించారు. ఈ మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

అషురెడ్డి క్లారిటీ 

అయితే ఈ ప్రచారంపై అషురెడ్డి స్పందించారు.  ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక స్టోరీని పోస్ట్ చేస్తూ క్లారిటీ ఇచ్చారు. తన ప్రమేయం లేకుండా, వాస్తవాలు తెలుసుకోకుండా తనపై తప్పుడు వార్తలు రాసినా లేదా దుష్ప్రచారం చేసినా సహించేది లేదని ఆమె హెచ్చరించారు. నా గురించి తప్పుడు ప్రచారం చేసే వారిపై, అసత్య వార్తలు రాసే మీడియా సంస్థలపై లీగల్ యాక్షన్ తీసుకుంటానంటూ ఆమె స్టోరీలో పేర్కొన్నారు. 

అషురెడ్డి కెరీర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌తోనే మొదలైంది. డబ్‌స్మాష్ వీడియోలతో ఆమె విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత పోలికలతో ఉండటంతో ఆమెను నెటిజన్లు జూనియర్ సమంత అని పిలిచేవారు. ఇదే ఆమెను తక్కువ కాలంలోనే సెలబ్రిటీని చేసింది. అషురెడ్డి కెరీర్‌లో అతిపెద్ద మలుపు బిగ్ బాస్ తెలుగు సీజన్ 3. ఈ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొని తన బోల్డ్ మాట తీరుతో, గ్లామర్‌తో బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఆ తర్వాత బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్‌లోనూ ఆమె మెరిశారు.

Advertisment
తాజా కథనాలు