గూస్ బంప్స్ తెప్పిస్తున్న కొత్త సినిమా ట్రైలర్.. వణుకుపుట్టాల్సిందే

సతీష్ బాబు రాటకొండ దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమా ‘జాతర’. ఈ సినిమాలో మెయిన్‌ లీడ్‌గా ఆయనే నటిస్తున్నాడు. నవంబర్ 8న ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

New Update
jathara,

టాలీవుడ్‌లో చిన్న చిన్న కొత్త చిత్రాలు అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంటున్నాయి. కంటెంట్ ఉంటే ఎలాంటి సినిమా అయినా హిట్ అవుతుందని ఆల్రెడీ ప్రూవ్ అయింది. ఎంతో మంది చిన్న హీరోలు కొత్త కొత్త సినిమాలు తీసి మంచి పాపులర్ అయ్యారు. వరుస హిట్లతో వెనక్కి తిరిగి చూసుకోలేదు.

Also Read : తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ.. సీఎం రేవంత్ సంచలన ప్రకటన

మరికొందరు వారి టాలెంట్‌తో దర్శకత్వం వహించడమే కాకుండా.. ఆ సినిమాలో మెయిన్ లీడ్‌గా నటిస్తూ బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నారు. ఇటీవల వచ్చిన కాంతారా సైతం అలాంటిదే. అయితే ఇప్పుడు మరో కొత్త సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Also Read :  దీపావళికి ఇల్లంతా దీపాలు.. ఎందుకో తెలుసా? అసలు కథ ఏంటి? 

సతీష్ బాబు రాటకొండ దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమా ‘జాతర’. ఈ సినిమాలో మెయిన్‌ లీడ్‌గా ఆయనే నటిస్తున్నాడు. గల్లా మంజునాథ్ సమర్పణలో మూవీటెక్ ఎల్‌ఎల్‌సితో కలిసి రాధాకృష్ణ ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై తెరకెక్కుతోంది.

Also Read :  10 నిమిషాల రన్నింగ్‌తో ఆ ప్రమాదకరమైన వ్యాధులు దూరం

ఈ చిత్రాన్ని రాధాకృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి కలిసి నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, ఫస్ట్ లుక్ అందరినీ విపరీతంగా ఆకట్టుకున్నాయి. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఇంటెన్స్ డ్రామాతో చిత్తూరు జిల్లా బ్యాక్ డ్రాప్‌ జరిగే జాతన నేపథ్యంలో ఈ సినిమా రాబోతుంది. నవంబర్ 8న ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. 

Also Read :  KTR, హరీష్ మధ్య కొట్లాట.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు!

జాతర ట్రైలర్ అదుర్స్

ఈ సందర్భంగా తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. అమ్మోరు ఊరు వదిలి వెల్లిపోయిందహో అంటూ దండోరా వేస్తున్నట్లుగా ట్రైలర్ మొదలైంది. ఆ తర్వాత వచ్చే డైలాగులు వరుసగా అదిరిపోయాయి. ఒకరకంగా చెప్పాలంటే గూస్ బంప్స్ తెప్పించాయనే చెప్పాలి. టెక్నికల్‌, విజువల్స్, ఆర్ఆర్ ఇలా ప్రతిదీ సినీ ప్రియుల్ని ఆకట్టుకున్నాయి. మరెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ట్రైలర్ చూసి ఎంజాయ్ చేయండి. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Raashii Khanna: రెడ్ బికినీలో రాశి గ్లామర్ షో.. నెట్టింట ఫొటోలు వైరల్

నటి రాశి ఖన్నా లేటెస్ట్ ఫొటోలు షేర్ చేసింది. రెడ్ స్విమ్ సూట్ లో రాశి హాట్ ఫోజులు సోషల్ మీడియాను హీటెక్కిస్తున్నాయి. ఈ ఫొటోలు మీరు చూశారా..?

New Update
Advertisment
Advertisment
Advertisment