/rtv/media/media_files/2025/02/12/koMyIcnp1n6OHkdZNbHW.jpg)
sankranthiki vasthunam fame bulli raju father filed police complaint
బుల్లి రాజు అంటే అందరికీ గుర్తొచ్చే సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ సినిమాలో రేవంత్ బీమాల.. వెంకటేష్ - ఐశ్వర్య రాజేశ్ కుమారుడిగా బుల్లిరాజు పాత్రలో నటించి మెప్పించాడు. ఇందులో ఈ బుడ్డోడు తన టైమింగ్ కామెడీతో అదరగొట్టేశాడు. ఇక అప్పటి నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నాడు. విశ్వక్ సేన్ ‘లైలా’ ప్రమోషన్లలో సైతం ఆకట్టుకుంటున్నాడు.
Also Read : ఇది మరీ దారుణం.. రేషన్ కార్డు దరఖాస్తుకు రూ.2వేలు.. మీసేవ సెంటర్ల వసూళ్ల దందా!
పోలీస్ కంప్లైంట్
అయితే ఇప్పుడు ఆ బుడ్డోడు రేవంత్ టాపిక్ సీరియస్ అయింది. సోషల్ మీడియాలో బుల్లిరాజు పేరుతో కొన్ని సంచలన పోస్టులు ఉండటంతో పలువురు ఆ బుడ్డోడిపై నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు. దీంతో అతడి తండ్రి తాజాగా పోలీసులను ఆశ్రయించాడు. తమ కొడుకుపై అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ మేరకు ఆయన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్టు పెట్టారు.
Also Read: TTD: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఇకపై వాట్సాప్‌లోనే
బుల్లిరాజు తండ్రి పోస్టు వైరల్
తమ అబ్బాయి రేవంత్ నటించిన పాత్రను ఇటీవల విడుదల అయ్యి ఘన విజయం సాధించిన “సంక్రాంతికి వస్తున్నాం" సినిమా ద్వారా ఆదరించి, ఆశీస్సులు అందచేసిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. కొన్ని రోజులుగా సోషల్ మీడియా (X) వేదికగా తమ అబ్బాయి పేరు మీద FAKE ACCOUNT లు క్రియేట్ చేసి సినిమా ప్రమోషన్ కోసం చేసిన వీడియోలను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు.
Also Read: Trump-musk: మస్క్ కు హై పవర్ ఇచ్చిన ట్రంప్...ఇక కోతలే..కోతలు!
తమ అబ్బాయికి సంబంధించిన అధికారిక వివరాలు & అప్డేట్స్ సోషల్ మీడియాలో కేవలం రేవంత్ భీమ్లా అనే పేరు మీద ఉన్న ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ నుండి ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటామన్నారు. ఇది తప్ప ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో తమకు ఎలాంటి ఇతర అకౌంట్లు, ఛానెల్స్ లేవని పేర్కొన్నారు. తప్పుడు వార్తలు సర్క్యూలేట్ చేస్తున్న విషయమై పోలీస్ వారికి ఫిర్యాదు చేశామన్నారు. దయచేసి తమకు, ముఖ్యంగా తమ అబ్బాయిని ఇటువంటి వివాదాలు రాజకీయాలతో ముడిపెట్టవద్దని అన్ని మీడియా వేదికలకు తెలియజేస్తున్నట్లు ఆయన ఆ పోస్టులో పేర్కొన్నారు. ప్రస్తుతం అతడి పోస్ట్ వైరల్‌గా మారింది.
Also Read: Trump-musk: మస్క్ కు హై పవర్ ఇచ్చిన ట్రంప్...ఇక కోతలే..కోతలు!
బుల్లిరాజు పేరుతో ఉన్న పోస్టు ఏంటేంటే?
బుల్లిరాజు పేరుతో ట్విట్టర్ అకౌంట్‌లో ఒక సంచలన పోస్టు ఉంది. పేటియం గాళ్లు బాగా కష్టపడ్డారు కానీ.. బ్రతుకులు ఎందుకురా? అని అందులో ఉంది. అంతేకాకుండా దొంగ ఓట్లతో గెలుద్దాం అనుకున్నప్పుడే మీకు 11 వచ్చాయని.. 10 నిమిషాల్లో 30వేల బోట్ ఓట్లు వేయించారంటే మీరు ఎంత ఫేక్ బతుకు బతుకుతున్నారో ఇప్పుడు క్లారిటీ వచ్చిందని ఆ పోస్టులో రాసుకొచ్చారు. అక్కడితో ఆగకుండ మీరు ఎంత గింజుకున్నా అకౌంట్ డిలీట్ చెయ్యనులే అని.. వచ్చే ఎన్నికల్లో ఆ 11 సీట్లు కూడా రావు అని అందులో ఉంది. దీంతో చాలా మంది ఆ పోస్టుపై అసభ్యకర కామెంట్లు పెడుతున్నారు. ఇప్పుడు దీనిపై బుల్లిరాజు తండ్రి స్పందించి క్లారిటీ ఇచ్చాడు.