/rtv/media/media_files/2024/12/09/t9NOTP5bLAmbhzu3lOq4.jpg)
'పుష్ప-2' మూవీ లిరీజ్ సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని RTC క్రాస్ రోడ్స్ లో సంధ్య థియేటర్‌లో బుధవారం రాత్రి ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ రావడంతో ఫ్యాన్స్ భారీగా వచ్చారు. దీంతో థియేటర్ ముందు తొక్కిలసట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. అయితే ఈ ఘటనపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు.
ఈ విషయంలో హీరో అల్లు అర్జున్ ను నిందించడం హాస్యాస్పదం అన్నారు. గతంలో తొక్కిసలాట ఘటనలు ఎన్నో జరిగాయని గుర్తుచేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సుదీర్ఘ పోస్ట్ పెట్టారు." భారీ సంఖ్యలో జనాలు పాల్గొన్నప్పుడే తొక్కిసలాట ఘటనలు జరుగుతాయి. ఇలాంటివి జరగడం ఇదేమీ తొలిసారి కాదు. తొక్కిసలాట ప్రమాదం వల్ల జరిగిందా? లేదా నిర్లక్ష్యం, అసమర్థత వల్ల జరిగిందా? ఉద్దేశపూర్వకంగా జరిగిందా? అనేది పూర్తిస్థాయి దర్యాప్తుతోనే తెలుస్తుంది.
అది పరిష్కారం కాదు..
గతంలో ఇలాంటి ఘటనలు జరిగి వేల సంఖ్యలో మరణాలు సంభవించినప్పుడు వివిధ కారణాల వల్ల ఏ ఒక్కరినీ నిందించలేదు. ఈ ఘటనను దృష్టిలోఉంచుకొని బెనిఫిట్ షోలను బ్యాన్ చేయడం సమస్యకు పరిష్కారం కాదు. వరదల బాధితులకు, లేదా ఎవరికైనా విరాళం అందించేందుకు గతంలో బెనిఫిట్ షోలు ప్రదర్శించేవారు. కానీ ప్రస్తుత రోజుల్లో ప్రేక్షకుల్లో ఉన్న ఆదరణను డబ్బు చేసుకోవడమే ఈ షోల ముఖ్యఉద్దేశం. దీనివల్ల ఎవరికీ ప్రయోజనం లేనప్పుడు వీటిని స్పెషల్ షోలు అని పిలవాలి.
Also Read : నా కుక్క ప్రేమ కంటే ఏ ప్రేమ గొప్పది కాదు.. చైతూ టార్గెట్ గా సమంత పోస్ట్
సాధారణ భోజనం, కాఫీలతో పోలిస్తే స్పెషల్ మీల్స్, కాఫీకి ఏవిధంగా అయితే ధర అధికంగా ఉంటుందో అదేవిధంగా స్పెషల్ షో టికెట్ రేట్లు కూడా అత్యంత ఖరీదుగా ఉంటాయి. రాజకీయ ర్యాలీలు, మీటింగ్స్‌కు ఏవిధంగా అయితే పర్మిషన్ ఇస్తారో అదేవిధంగా సినిమా ప్రదర్శనలకు కూడా పలువురు అధికారుల ఆమోదం ఉండాలి. సినీ తారలు థియేటర్లను విజిట్ చేయడం ఎంతోకాలం నుంచి జరుగుతుంది. వారిని చూసేందుకు జనాలు ఎగబడుతుంటారు.
వారే బాధ్యత వహించాలి..
ఒక స్టార్ థియేటర్ విజిట్‌కు అనుమతి ఇవ్వాలా? వద్దా? అనే దానిపై పోలీసులు లేదా థియేటర్ యాజమాన్యం బాధ్యత వహించాలి. అంతేకానీ బెనిఫిట్ షోలను ఎందుకు నిషేధించాలి? దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో ఈ సినిమా బెనిఫిట్ షోలు ప్రదర్శించారు. అల్లు అర్జున్ కేవలం ఒక్క థియేటర్‌కు మాత్రమే హాజరయ్యాడు. అక్కడే ఈ ఘటన జరిగింది.
సరైన నిర్ణయం తీసుకోవాలి..
కాబట్టి స్టార్ విజిట్ చేసే థియేటర్ వద్ద ఆంక్షలు పెట్టకుండా బెనిఫిట్ షోలే పూర్తిగా రద్దు చేయాలనుకోవడం చూస్తుంటే.. ఒక ప్రమాదం జరిగిందని వాహనాలను రోడ్ల పైకి రావద్దన్నట్లు ఉంది. దీనివల్ల సమస్య తప్పుగా అర్థమయ్యే అవకాశం ఉంది. రాజకీయ సమావేశాలు, మేళాల్లో తొక్కిసలాట జరిగితే.. వాటిని ఎప్పుడైనా పూర్తిగా రద్దు చేశారా? అధికారులంతా ఈవిధంగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని ఆశిస్తున్నా