/rtv/media/media_files/2025/02/11/kmqTUYgoiUYojR9zosq8.jpg)
Samantha post
Samantha: నటి సమంత తరచూ సోషల్ మీడియాలో తన వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అయితే తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లో సమంత చేసిన ఓ పోస్ట్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. "మనిషిగా మీరు ఒక స్థిరమైన జీవి కాదు. ఏదీ స్థిరంగా ఉండదు - మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ఉండవచ్చు'' అంటూ కొటేషన్ పెట్టారు. అయితే ఇటీవలే ఓ పాడ్ కాస్ట్ లో నాగచైతన్య సమంతతో విడాకులు, ప్రస్తుతం శోభితతో పెళ్లి గురించి చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ ఈ పోస్ట్ ఉన్నట్లు నెటిజన్లు అనుకుంటున్నారు.
/rtv/media/media_files/2025/02/11/gxLeql3CZRDE2XWhUqKZ.png)
తనకు ఎటువంటి సంబంధం లేదు..
ఇటీవలే పాల్గొన్న పాడ్ కాస్ట్ లో నాగచైతన్య విడాకుల గురించి మాట్లాడుతూ.. ఇద్దరి అంగీకారంతోనే విడాకులు తీసుకోవడం జరిగిందని. ప్రస్తుతం తామిద్దరూ జీవితంలో మూవ్ ఆన్ అయ్యామని. మునుపటి వివాహం పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని అన్నారు. ఆ తర్వాత తనకు శోభితతో ప్రేమ ఏర్పడిందని.. సమంత నుంచి విడాకులతో శోభితకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఆ విషయంలో శోభితను నింధించడం పట్ల నిరాశను వ్యక్తం చేశారు. సామ్ తో విడాకుల తర్వాత ఓ సోషల్ మీడియా చాట్ ద్వారా శోభితతో చాలా సహజంగా తన బంధం అభివృద్ధి చెందిందని స్పష్టం చేశారు.
Also Read: Allu Aravind: బన్నీ డ్యాన్స్ చిరంజీవి నుంచి వచ్చింది కాదు.. అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్స్!
ప్రస్తుతం నాగచైతన్య, సమంత ఇద్దరూ ఎవరి కెరీర్ లో వారు బిజీగా ఉన్నారు. సామ్ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పికిల్ బాల్ 'Chennai Super Champs' టీమ్ ఓనర్ గా బిజీగా ఉంది. మరోవైపు నాగచైతన్య ఇటీవలే 'తండేల్' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని చందూ మొండేటి తెరకెక్కించారు.
Also Read: Thandel Movie: ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో 'తండేల్' పైరసీ.. విచారణకు ఆదేశించిన సంస్థ ఛైర్మన్