![saif ali khan attack](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/rtv/media/media_files/2025/01/16/gQ510Ii3V4sj4HZ0O00A.jpg)
saif ali khan
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై గుర్తుతెలియని వ్యక్తి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడిలో నటుడి ఒంటిపై ఆరుచోట్ల గాయాలయ్యాయి. దీంతో సైఫ్ ను ముంబైలోని లీలావతి హాస్పిటల్ లో చేర్పించారు. ప్రస్తుతం ఆయనకు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.
సైఫ్ వెన్నుముక నుంచి 2.5 అంగుళాల పొడవైన కత్తి ములను తొలగించి, మెడ పై గాయానికి ప్లాస్టిక్ సర్జరీ చేసి ఐసీయూకి షిఫ్ట్ చేశారు. అయితే ఈ డాడి గురించి సైఫ్ అలీఖాన్ ఇంటి పనిమనిషి సంచలన నిజాలు వెల్లడించారు. దాడి జరుగుతున్నప్పుడు కరీనా, పిల్లలు అక్కడే ఉన్నారని, దుండగుడు పొడుస్తుంటే కేకలు వేస్తూ..సైఫ్ తన రూమ్‌లోకి పరుగెత్తాడని, నిందితుడికి, సైఫ్‌కు జరిగిన తోపులాటలో
తనకు కూడా గాయాలయ్యాయని చెప్పారు.
Also Read : సైఫ్ అలీ ఖాన్ హెల్త్ బులిటెన్ విడుదల.. డాక్టర్లు ఏం చెప్పారంటే
అలాగే సైఫ్‌ను పొడిచి నిందితుడు అక్కడి నుంచి వెంటనే పారిపోయాడని తెలిపారు. కాగాసైఫ్‌పై దాడి ఘటనలో ఇంట్లో పనిచేస్తున్న నలుగుర్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారరించారు. ఈ విచారంలో సైఫ్‌పై దాడి చేసిన ఇద్దరు నిందితులను గుర్తించారు. పక్క ఇంటి సీసీ ఫుటేజ్‌లో నిందితుల దొరికినట్లు తెలుస్తోంది. నిందితుల ఫింగర్ ప్రింట్స్ సేకరించిన పోలీసులు వాళ్ళ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం.
Also Read : సైఫ్ పై దాడి వెనుక బిష్ణోయ్ గ్యాంగ్.. వెలుగులోకి సంచలన విషయాలు!