టార్గెట్ సైఫా లేక పిల్లలా? .. సీసీ టీవీ ఫుటేజ్‌లో కీలక విషయాలు!

సైఫ్ పై దాడి ఘటనలో సీసీటీవీ ఫుటేజ్‌లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అర్ధరాత్రి 2 : 30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకోగా రాత్రి 12 గంటల తరువాత ఇంట్లోకి ఎవరూ వెళ్లినట్లుగా ఆనవాళ్లు లేవు. పిల్లల బెడ్‌రూమ్‌ దగ్గరే దుండగుడు ఘర్షణకు దిగడం షాక్ కు గురిచేస్తుంది

New Update
saif ali khan house

saif ali khan house Photograph: (saif ali khan house)

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్‌పై దాడి ఘటనలో సీసీ టీవీ ఫుటేజ్‌లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సైఫ్ అలీఖాన్‌ మీద అటాక్‌ జరిగే 02 గంటల ముందు వరకు ఇంట్లోకి ఎవరూ రాలేదని నిర్ధారణ అయింది.  అర్ధరాత్రి 2 : 30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకోగా రాత్రి 12 గంటల తరువాత ఇంట్లోకి ఎవరూ వెళ్లినట్లుగా ఆనవాళ్లు లేవని పోలీసులు అంటున్నారు. దీన్ని బట్టి చూస్తే లోపలి వ్యక్తులే సైఫ్ అలీఖాన్‌పై దాడి చేశారని పోలీసుల అనుమానిస్తున్నారు. లోపల సైఫ్ పై ఎటాక్ జరుగుతుంటే ఏడుగురు సెక్యూరిటీ గార్డులు ఏమయ్యారని పోలీసులు విచారణ సీరియస్ గా జరుపుతున్నారు.  

టార్గెట్ సైఫా లేక పిల్లలా?

పిల్లల బెడ్‌రూమ్‌ దగ్గరే పనిమనిషితో దుండగుడు ఘర్షణకు దిగడం మరింత షాక్ కు గురిచేస్తుంది. దుండగడు పిల్లల బెడ్‌రూమ్‌ లోపలికి వెళ్తుండగా శబ్ధం రావడంతో పనిమనిషి లేచి చూసింది. దీంతో ఆమెను గమనించిన  దొంగ పనిమనిషితో గొడవకు దిగాడు. పనిమనిషి అరుపులకు నిద్ర లేచిన  సైఫ్‌  వెంటనే బయటకు రావడంతో దుండగుడు అతనిపై కత్తితో దాడి చేశాడు. అయితే  దుండగుడి టార్గెట్ సైఫా లేక అతని పిల్లలా? అనేది పోలీసులకు అంతు చిక్కడం లేదు. సైఫ్ చిన్న కొడుకు జెహ్ (4)ను చంపేందుకే  దుండగుడు ఇంట్లోకి ప్రవేశించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో పనిమనిషికి  దొరికిపోయి దాడి చేయాల్సి వచ్చిందా.. సైఫ్‌ శత్రువులు పనివాళ్లతో ఏమైనా హత్యకు కుట్ర చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.  కత్తిపోట్లకు సైఫ్ అరుస్తుంటే ఫ్యామిలీ ఎందుకు బయటకు రాలేదు పోలీసులకు ఇవన్ని అంతుచిక్కని ప్రశ్నల్లా మిగిలిపోయాయి.  సైఫ్ కళ్లు తెరిచి నిందితుల గురించి ఏమైనా విషయాలు చెబితే తప్ప ఈ  కేసు బయటకు తెలియని పరిస్థితి నెలకొంది.  

మరోవైపు  సైఫ్ అలీఖాన్‌ ఆరోగ్యంపై  ముంబైలోని లీలావతి ఆసుపత్రి డాక్టర్లు కీలక ప్రకటన చేశారు.  ఆరు కత్తిపోట్లతో ఆసుపత్రిలో చేరిన  సైఫ్ అలీఖాన్‌ కు సుమారుగా రెండు గంటలకు పైగా కాస్మెటిక్ సర్జరీ చేశారు వైద్యులు. ఈ సర్జరీలో సుమారు 2 నుంచి 3 అంగుళాల పొడవు ఉన్న ఓ వస్తువును  బయటకు తీశారు. ప్రస్తుతం సైఫ్ ఆరోగ్యం నిలకడగా ఉందని.. అతనికి ఎలాంటి ప్రమాదం లేదన్నారు. మరికొన్ని రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని వెల్లడించారు. దీంతో అతని ఫ్యాన్ప్ ఊపిరి పిల్చుకున్నారు. ఈ విషయం తెలియగానే  సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ  సైఫ్ అలీఖాన్‌ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

కాగా 2012లో వివాహం చేసుకున్న కరీనా, సైఫ్ ముంబైలోని బాంద్రా వెస్ట్‌లోని సద్గురు శరణ్ భవనంలో నివసిస్తున్నారు. ఈ దంపతుల ఇద్దరు కుమారులు - తైమూర్ (8), జెహ్ (4) ఉన్నారు.  

Also Read :  షాకింగ్ న్యూస్ .. విడాకులు తీసుకోనున్న ఒబామా కపుల్స్!

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు