/rtv/media/media_files/2025/01/16/sZtkGeq1UgfTlN2EhU4Q.jpg)
saif ali khan kareena kapoor Photograph: (saif ali khan kareena kapoor)
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్‌పై దాడి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గురువారం తెల్లవారుజామున 3 :30 గంటల ప్రాంతంలో ముంబైలోని బాంద్రా వెస్ట్‌లోని తన నివాసంలో ఓ దొంగ సైఫ్ అలీ ఖాన్పై దాడికి దిగాడు. ఆర్థరాత్రి ఇంట్లోకి చొరబడిన గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లో దొంగతనం చేసి పారిపోతుండగా పనిమనిషికి చిక్కాడు. దీంతో దొంగకు, పనిమనిషికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ఈ క్రమంలో ఇంట్లో నిద్రపోతున్న సైఫ్ వెంటనే లేచి చూసి పనిమనిషిని కాపాడేందుకు ప్రయత్నం చేయగా దుండగుడు కత్తితో సైఫ్ పై ఎటాక్ చేశాడు. ఆరు సార్లు సైఫ్ ను కత్తితో పొడిచి దుండగుడు అక్కడినుంచి పారరయ్యాడు. వెంటనే సైఫ్ ను ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. అయితే సైఫ్ అలీఖాన్ భార్య, హీరోయిన్ కరీనా కపూర్ లేని టైమ్ లోనే ఈ ఘటన చోటుచేసుకుంది. హీరోయిన్ కరిష్మా కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో గర్ల్స్ నైట్ ఔట్ అంటూ ఓ పోస్టు పెట్టింది. ఈ పార్టీలో కరీనాతో పాటుగా ఆమె సోదరి కరిష్మా, రియా, సోనమ్ కపూర్‌లు పాల్గొన్నారు.
బాగా తెలిసిన వ్యక్తినే
ముంబై పోలీసులు, క్రైమ్ బ్రాంచ్‌లు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన వ్యక్తికి ఆ ఇళ్లు గురించి బాగా తెలిసి ఉంటుందనిపోలీసులు అనుమానిస్తున్నారు. సైఫ్ అలీఖాన్ స్టార్ హీరో కాబట్టి ఎప్పుడు సెక్యూరిటీ ఉంటుంది. పైగా ఇంటి చుట్టుపక్కల సీసీ కెమెరాలుంటాయి. ఈజీగా అతని ఇంట్లో దొంగతనం చేసేందుకు ఎవరూ కూడా పెద్దగా సాహసం చేయరు. ఇదంతా తెలిసినవాళ్ల పనే అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
కరీనా లేని టైమ్ చూసి, సైఫ్ ఒక్కడే ఉన్నాడని తెలిసే ఇంట్లోకి దొంగతనానికి పాల్పడ్డాడని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనను చాలా సీరియస్ గా తీసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకోవడానికి అనేక బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. కాగా 2012లో వివాహం చేసుకున్న కరీనా, సైఫ్ ముంబైలోని బాంద్రా వెస్ట్‌లోని సద్గురు శరణ్ భవనంలో నివసిస్తున్నారు. ఈ దంపతుల ఇద్దరు కుమారులు - తైమూర్ (8), జెహ్ (4) ఉన్నారు. ఇక సైఫ్ అలీ ఖాన్ చివరిసారిగా పాన్-ఇండియా చిత్రం దేవరలో నటించారు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్‌లతో కలిసి ఆయన కనిపించారు.
Also Read : Israel-Hamas: ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం!