![saif ali khan attack](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/rtv/media/media_files/2025/01/16/X1ANCmjYJIxRANnvnpdJ.jpg)
saif ali khan attack
బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ దాడి ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దాడి కేవలం దొంగతనం నేపథ్యంలోనే జరిగిందని, సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఆ నిందితుడిని గుర్తించి ఫొటో కూడా రిలీజ్ చేశారు. గురువారం తెల్లవారుజామున 2.33 గంటలకు సైఫ్ ఇంటికిలో దుండగుడు మెట్ల మార్గంలో వెళ్తున్న వీడియో సీసీటీవీలో రికార్డయ్యింది.
టీ షర్ట్, జీన్స్ ధరించిన వ్యక్తి మెట్లు దిగుతున్న వీడియో రికార్డ్ అయింది. వెళ్లిపోయే క్రమంలో అతను సీసీకెమెరా వైపు చూశాడు. ఇదిలా ఉంటే పోలీసులు జరిపిన విచారణలో మరో సంచలన విషయం బయటపెట్టారు. అదేంటంటే.. నిందితుడు ఇంట్లోకి చొరబడి దాడి చేసే ముందు సైఫ్ అలీ ఖాన్ ను రూ.కోటి డిమాండ్ చేశాడట.
దీనికి సైఫ్ ఒప్పుకోకపోవడంతో అగంతకుడు దాడి చేసినట్లు పోలీసులు విచారణలో తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే బయటకొచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా ఈ దాడి ఘటనలో సైఫ్ వెన్నెముక భాగంలో తీవ్ర గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు.
శస్త్రచికిత్స ద్వారా 2.5 అంగుళాల కత్తి ముక్కను వెన్నుపూస నుంచి తొలగించారు. వెన్నుపూస ద్రవాలు లీక్ కాకుండా చర్యలు తీసుకున్నారు. అలాగే ఎడమ చేయి, మెడ వద్ద గాయాలకు ప్లాస్టిక్ సర్జరీ బృందం చికిత్స అందించింది. ప్రస్తుతం సైఫ్ ఐసీయూలో కోలుకుంటున్నారు. అతని ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు ప్రకటించారు.
Also Read : సైఫ్ అలీ ఖాన్ హెల్త్ బులిటెన్ విడుదల.. డాక్టర్లు ఏం చెప్పారంటే