Tollywood : నటి సాయి పల్లవి ఇటీవలే అమరన్ సినిమాతో తెలుగులో మరో హిట్టు కొట్టింది. ప్రస్తుతం తెలుగులో తండేల్, హిందీలో రామాయణం సినిమాలతో బిజీగా ఉంది.నాగచైతన్య, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే సాయి పల్లవి తెలుగులో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. Also Read: సంధ్య థియేటర్ ఘటన.. అల్లు అర్జున్ కు ప్రముఖ హీరోయిన్ సపోర్ట్, రేవంత్ పై ఫైర్ బలగం వేణు సినిమాలో బలగం ఫేమ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కనున్న 'ఎల్లమ్మ' సినిమాలో సాయి పల్లవి కథానాయికగా నటించబోతున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కథ బాగా నచ్చడంతో వెంటనే సినిమాకు ఒకే చేసిందట. సాధారణంగా కథల ఎంపిక విషయంలో సాయిపల్లవి సెలెక్టివ్‌గా ఉంటుంది. పాత్రకు ప్రాధాన్య, ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉంటేనే ఆమె సినిమా చేయడానికి ఇష్టపడుతుంది. దీంతో 'ఎల్లమ్మ' పై ప్రేక్షకులలో మరింత ఆసక్తి పెరిగింది. Also Read: Year Ender2024: తెలుగులో సత్తా చాటిన బాలీవుడ్ బ్యూటీస్.. సౌత్ భామలు కూడా అక్కడ.. అయితే బలగం వేణు ఎప్పటి నుంచో 'ఎల్లమ్మ' సినిమా చేయాలని హీరోలందరికీ కథ చెబుతూ ఉన్నాడు. మొదటగా ఈ కథను నేచురల్ స్టార్ నానికి వినిపించాడు. కానీ స్టోరీ నచ్చకపోవడంతో నాని నో చెప్పినట్లు టాక్. ఆ తర్వాత శర్వానంద్, తేజ సజ్జా, హీరో నితిన్ కి కూడా వినిపించగా.. నితిన్ ఒకే చెప్పారని సమాచారం. ఫైనల్ గా 'ఎల్లమ్మ' కథను నితిన్ చేయబోతున్నారట. తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. 2025 ఫిబ్రవరి నుంచి ఎల్లమ్మ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు.. ఏడాది చివరిలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. ఒకవేళ షూటింగ్ ఆలస్యం అయితే 2026 సంక్రాంతికి విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. Also Rea: NTR, చరణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఓటీటీలో 'RRR' బిహైండ్ ది సీన్స్! Also Read : నా కోరిక అదే.. రేవంత్ రెడ్డితో నాగార్జున ఇంట్రెస్టింగ్ కామెంట్స్!