Thaman: 'రాజాసాబ్' పై అంచనాలు పెట్టుకోకుండా ఉంటే బెటర్.. థమన్ షాకింగ్ కామెంట్స్

'రాజాసాబ్' ఆడియో లాంచ్ జ‌పాన్‌లో చేయబోతున్నట్లు తెలిపాడు మ్యూజిక్ డైరెక్టర్ థమన్. సినిమాలో ఓ డ్యూయెట్‌, స్పెషల్‌ సాంగ్‌, ముగ్గురు హీరోయిన్లతో ఓ పాట ఉన్నాయన్నారు. ఎలాంటి అంచ‌నాలు లేకుండా వెళ్లి సినిమా చూస్తే అంత ఎక్కువ‌గా ఎంజాయ్ చేస్తార‌ని చెప్పాడు.

New Update
s s thaman  about rajasaab

s s thaman prabhas rajasaab


రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో 'రాజాసాబ్' ఒకటి. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ కథానాయికలుగా నటిస్తున్నారు. అలాగే, సంజయ్ దత్, మురళి శర్మ, అనుపమ్ ఖేర్ వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా.. ఆయన సంగీతంపై అభిమానుల్లో పెద్ద ఎత్తున అంచనాలు ఉన్నాయి. ఇక తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమాకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. జ‌పాన్‌లో ఈ మూవీ ఆడియో లాంచ్ చేయబోతున్నట్లు తెలిపాడు.

అలాగే సాంగ్స్ గురించి మాట్లాడుతూ.. సినిమాలో ఓ డ్యూయెట్‌, స్పెషల్‌ సాంగ్‌, ముగ్గురు హీరోయిన్లతో ఓ పాట, హీరో ఇంట్రడక్షన్‌ సాంగ్‌ ఉన్నాయన్నారు. అలాగే ఫ్యాన్స్ కానీ, ఆడియన్స్ కానీ 'రాజాసాబ్' పై ఎలాంటి అంచ‌నాలు లేకుండా వెళ్లి సినిమా చూస్తే అంత ఎక్కువ‌గా ఎంజాయ్ చేస్తార‌ని చెప్పాడు. దీంతో ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతున్నాయి.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ ఫుల్ హైప్ క్రియేట్ చేశాయి. ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10 న రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవెల్ లో నిర్మిస్తున్నారు. 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు