పుష్ప 2 మూవీ పాన్ ఇండియా కాదు.. ఆర్జీవీ ట్వీట్ వైరల్

‘పుష్ప2’పై ఆర్జీవీ ప్రశంసలు కురిపించారు. బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా పుష్ప2 హిస్టరీ క్రియేట్ చేసిందన్నారు. నాన్ హిందీ యాక్టర్ బన్నీ హిందీలో బిగ్గెస్ట్ స్టార్‌గా నిలిచారని, ఇది పాన్ ఇండియా మూవీ కాదని.. తెలుగు ఇండియా సినిమా అని అన్నారు.

New Update
pushpa 2 (10)

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘పుష్ప 2’ మూవీ నేషనల్ వైడ్‌గానే కాకుండా ఇంటర్నేషనల్ వైడ్‌గా దుమ్ము దులిపేస్తోంది. ఓ వైపు కలెక్షన్ల వర్షం కురిపిస్తూనే మరోవైపు రికార్డుల మోత మోగిస్తోంది. కనీ వినీ ఎరుగని రీతిలో థియేటర్లలో అదరగొట్టేస్తోంది. 

Also Read : 'పుష్ప2' గంగమ్మ తల్లీ జాతర సీన్.. థియేటర్ లో పూనకాలతో ఊగిపోయిన మహిళ

ముఖ్యంగా ఈ మూవీలోని అల్లు అర్జున్ యాక్టింగ్ ఓ రేంజ్‌లో ఉందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. బన్నీ యాక్టింగ్, స్వాగ్, మ్యానరిజం, డైలాగ్స్ అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే సినిమాలో చాలానే ఉన్నాయి. దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు. ప్రేక్షకులు, అభిమానులు ఈ చిత్రంలో బన్నీని ఎలా చూడాలనుకున్నారో అదే రేంజ్‌లో చూపించి సక్సెస్ అయ్యాడు. 

ఇది కూడా చూడండి: తిరుమలలో రన్నింగ్ కారులో మంటలు..భయంతో భక్తులు పరుగులు

ఆర్జీవీ ఆసక్తికర ట్వీట్

ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌తో మూవీపై ప్రశంసలు కురుస్తున్నాయి. సినీ ప్రముఖులు సైతం ఈ సినిమాపై అదిరిపోయే రివ్యూలు ఇస్తున్నారు. సినిమా అదిరిపోయిందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాపై ప్రశంసలు కురిపించాడు. ఇప్పటికే ఈ సినిమాపై తన రివ్యూని అందించిన ఆర్జీవీ తాజాగా మరోసారి స్పందించారు. 

ఇది కూడా చూడండి: వందే భారత్ స్లీపర్ రైళ్లకు ముహుర్తం ఫిక్స్‌..ఈ మార్గంలోనే తొలి రైలు!

పుష్ప2 మూవీ హిందీలో సృష్టించిన వసూళ్ల రికార్డులను ఉద్దేశించి ట్విట్టర్‌లో ఒక పోస్ట్ పెట్టారు. హిందీలో డబ్బింగ్ సినిమా సత్తా చాటిందని.. బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా పుష్ప2 సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసిందని అన్నారు. నాన్ హిందీ యాక్టర్ అల్లు అర్జున్ హిందీలో బిగ్గెస్ట్ స్టార్‌గా నిలిచారని ప్రశంసించారు. అందువల్ల ఇది పాన్ ఇండియా మూవీ కాదని.. తెలుగు ఇండియా సినిమా అని పేర్కొన్నారు. ప్రస్తుతం అతడి ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. 

మూడు రోజుల్లో రూ.621 కోట్ల కలెక్షన్స్

ఇది కూడా చూడండి: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..నేడు ఈ జిల్లాల్లో వానలు!

ప్రపంచ వ్యాప్తంగా పుష్పగాడి రూల్ నడుస్తోంది. పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా.. కాదో.. వైల్డ్ ఫైర్ అన్నట్లుగానే సినిమా కలెక్షన్స్ దుమ్ము రేపుతున్నాయి. ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయిన నాటి నుంచి ఇప్పటి వరకు భారీ రెస్పాన్స్‌తో అదరగొడుతోంది. డిసెంబర్ 5న రిలీజ్ అయిన ఈ సినిమా అబ్బురపరచే కలెక్షన్లు నమోదు చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కేవలం 3 రోజుల్లోనే రూ.621 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి అందరినీ అవాక్కయ్యేలా చేసింది. దీంతో అతి తక్కువ రోజుల్లోనే ఫాస్టెస్ట్‌ కలెక్షన్స్ నమోదు చేసి ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసింది.

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Terror Attack: ఉగ్రదాడిలో 28 మంది మృతి.. తనికెళ్ల భరణి కన్నీటి కవిత

పహల్గాం టెర్రరిస్టు అటాక్‌పై సినీ నటుడు తనికెళ్ల భరణి స్పందించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక కన్నీటి కవితను షేర్ చేసారు. కాశ్మీరంలోనే కుంకం పువ్వెందుకు పూస్తుందో నా కర్ధమైపోయింది! అంటూ ఆ కవిత సాగుతుంది. ప్రస్తుతం అది నెట్టింట వైరల్‌గా మారింది.

New Update
Pahalgam Terror Attack

Pahalgam Terror Attack

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అందమైన ప్రదేశాలను చూసేందుకు వచ్చిన టూరిస్టులపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో దాదాపు 28 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ముస్లిమేతరులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడినట్లు సాక్ష్యులు చెబుతున్నారు. 

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

అమాయక ప్రజల మృతిపై ఇప్పటికే సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, వ్యాపార వేత్తలు సంతాపం తెలిపారు. ఈ చర్యలకు పాల్పడిన వారిని అస్సలు వదలకూడదని.. కఠినంగా శిక్షించాలంటూ భారతీయులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ సీనియర్ యాక్టర్ తనికెళ్ల భరణి స్పందించారు. ఈ మేరకు ఒక కవితతో ఉన్న పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

కన్నీటి కవిత

కాశ్మీరంలోనే కుంకం పువ్వెందుకు పూస్తుందో నా కర్ధమైపోయింది!
అక్కడ ఉన్నట్టుండి పాకే పాకే పసిబిడ్డ నెత్తురు ముద్దై పోతుంది. 

సామగానం చేసే కాశ్మీరీ పండితుల కంఠాల్లోంచి వేదం ఆగి- రుధిరం బైటికొస్తుంది.

అక్కడ రేపు పల్లకీ లెక్కి ఊరేగాల్సిన పెళ్ళికొడుకులు ఇవాళే పాడెక్కుతారు...

ఆ లోయలో హిమాలయాలు సైతం మూర్తీభవించిన వైధవ్యాల్లా ఉంటాయ్

భరతమాత కిరీటం వొరుసుకునీ నిరంతరం అక్కడ నెత్తురోడుతూ ఉంటుంది !

బుద్ధుడు కూడా కళ్ళూ నోరూ మూసుకుని మళ్ళీ అంతర్ముఖుడౌతాడు !!

ఎప్పుడో 40 ఏళ్ళ క్రితం రాసిన కవిత, ఇంకా తడిగానే ఉంది!! అంటూ తనికెళ్ల భరణి ఒక కవితను పంచుకున్నారు. ఇప్పుడది నెట్టింట వైరల్‌గా మారింది. 

 

pahalgam | Pahalgam attack | pahalgam breaking news | tanikella-bharani | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment