సంధ్య థియేటర్ కేసు.. అల్లు అర్జున్‌పై రేవతి భర్త సంచలన వ్యాఖ్యలు!

సంధ్య థియేటర్ ఘటనపై మృతురాలు రేవతి భర్త భాస్కర్ స్పందించారు. ఈ ఘటనకు అల్లు అర్జున్ కారణం కాదన్నారు. తమ వల్లే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడన్న విషయం తమకు నచ్చలేదన్నారు. రెండో రోజు నుంచే బన్నీ నుంచి తమకు మద్దతు లభించిందని తెలిపారు.

New Update
Revathi husband Bhaskar about allu arjun

Revathi husband Bhaskar about allu arjun

సంధ్య థియేటర్ కేసు వ్యవహారం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు నేషనల్ వైడ్‌గా రచ్చకెక్కింది. అల్లు అర్జున్ కారణంగానే రేవతి అనే మహిళ తొక్కిసలాటలో మృతి చెందింది అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం పేర్కొన్నారు. అతడు థియేటర్‌కు వచ్చి సినిమా చూసి వెళ్లిపోతే ఇంత రాద్దాంతం జరకపోయేదని అన్నారు. కానీ సంధ్య థియేటర్‌కు వచ్చే ముందు రోడ్ షో చేసుకుంటూ రావడంతోనే ఫ్యాన్స్ విపరీతంగా గుమిగూడారని.. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగి ఆమె మరణించిందని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 

Also Read: ఏపీలో ఫ్రీ బస్ పథకం.. 2,000 బస్సులు, 11,500 మంది సిబ్బంది అవసరం!

అంతేకాకుండా థియేటర్ వద్ద జరిగిన విషయాన్ని పోలీసులు బన్నీకి చెప్పినా అతడు పట్టించుకోకుండా థియేటర్‌లో సినిమా చూశాడని పేర్కొన్నారు. ఇంతటి వ్యక్తిని ఏమనాలి అని ప్రశ్నించారు. అదేగాక ఒకరాత్రి జైల్లో ఉండి మరుసటి రోజు విడుదలైన అల్లు అర్జున్ ఇంటికి సినీ ప్రముఖులు క్యూ కట్టారు తప్ప ఏ ఒక్కరైనా బాధితురాలి కుటుంబ సభ్యులను కానీ, హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న మృతురాలి కుమారు శ్రీతేజ్‌ను చూడ్డానికి కానీ ఎవరూ వెళ్లకపోవడం బాధాకరమైన విషయమన్నారు.

Also Read: శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శనం గంట నుంచి 3 గంటల్లోపే 

ఇక రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ కావడంతో అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టారు. తనపై తప్పుడు ఆరోపణలు చేశారని తెలిపారు. తన క్యారెక్టర్‌ను దెబ్బతీస్తున్నారని పేర్కొన్నారు. సినిమా చూస్తున్న సమయంలో పోలీసులు తన వద్దకు వచ్చి జరిగిన విషయం చెప్పారని అంటున్నారని.. కానీ అందులో ఎలాంటి వాస్తవం లేదని తెలిపారు. తనను పోలీసులు కలవలేదని చెప్పారు. తనపై తప్పుడు అలిగేషన్స్ చేస్తున్నారని ఆవేదన చెందారు. తాను అన్ని జాగ్రత్తలు, పర్మిషన్స్ తర్వాతే థియేటర్ వెళ్లానని చెప్పారు. తాను రోడ్ షో చేయలేదన్నారు. ఇక సినిమా చూస్తున్న సమయంలో జనం ఎక్కువయ్యారు వెళ్లిపోవాలని మా టీమ్ చెప్పగానే వెళ్లిపోయానని చెప్పుకొచ్చారు.

Also Read: రైల్వే శాఖలో 32,438 ఉద్యోగాలు.. అర్హులు ఎవరంటే?

మీడియాతో రేవతి భర్త భాస్కర్  

ఇలా ఓవైపు రేవంత్ చేసిన వ్యాఖ్యలు.. మరోవైపు అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. తాజాగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై మృతురాలి రేవతి భర్త స్పందించారు. ఈ మేరకు ఓ మీడియాతో ఆయన మాట్లాడారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనకు అల్లు అర్జున్ కారణం కాదని చెప్పారు. తమ అబ్బాయి అల్లు అర్జున్‌కు పెద్ద అభిమాని అని.. పుష్ప 2 సినిమాకు వెళ్దామని నెల రోజుల ముందు అడిగేవాడని తెలిపారు.

Also Read: తెలంగాణలో కీచక టీచర్.. నాలుగో తరగతి బాలికలతో, ఛీ ఛీ!

దీంతో తన స్నేహితులను అడిగి టిక్కెట్లు కొనుక్కున్నామన్నారు. ఇక ఈ ఘటన అనంతరం తమ వల్లే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడన్న విషయం తమకు నచ్చలేదన్నారు. ఈ విషయం జరిగిన రెండో రోజు నుంచే అల్లు అర్జున్ నుంచి తమకు మద్దతు లభించిందని తెలిపారు. తాము వేసిన కేసు కూడా వెనక్కు తీసుకోవాలని అనుకున్నాం అని రేవతి భర్త భాస్కర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం అతడి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు