Rashmika-Vijay : రాకుమారుడిలా విజయ్.. మహాలక్ష్మిలా రష్మిక! మెహందీ ఫోటోలు చూశారా?

టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి వేడుకలు ఎంత ఘనంగా జరిగాయో మనందరికీ తెలిసిందే. ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో జరిగిన వీరి వివాహం తర్వాత, తాజాగా తమ మెహందీ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఈ జంట సోషల్ మీడియాలో పంచుకున్నారు

New Update
vijay

టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి వేడుకలు ఎంత ఘనంగా జరిగాయో మనందరికీ తెలిసిందే. ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో జరిగిన వీరి వివాహం తర్వాత, తాజాగా తమ మెహందీ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఈ జంట సోషల్ మీడియాలో పంచుకున్నారు. బాలీవుడ్ స్టైల్ పెళ్లిళ్లకు భిన్నంగా, సంప్రదాయానికి పెద్దపీట వేస్తూ వీరు ధరించిన దుస్తులు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

ముఖ్యంగా రష్మిక మెహందీ కోసం ధరించిన మల్టీ కలర్ లెహంగా సెట్ హైలైట్ అని చెప్పాలి. ఢిల్లీకి చెందిన ప్రముఖ డిజైనర్ కరణ్ తోరానీ ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ అవుట్‌ఫిట్‌లో రష్మిక అద్భుతంగా మెరిసిపోయింది. మెరూన్, ఆలివ్ గ్రీన్, ఇండిగో బ్లూ రంగుల కలయికలో వచ్చిన ఈ డ్రెస్‌లో మరొక విశేషం ఏమిటంటే.. ఆమె ధరించిన దుపట్టాపై లక్ష్మీదేవి ప్రతిరూపాన్ని ఎంబ్రాయిడరీ చేశారు. ఇక విజయ్ దేవరకొండ సైతం రష్మికకు పోటీగా గ్రీన్ కలర్ కుర్తా, ఇండిగో వేష్టి, ఎంబ్రాయిడరీ జాకెట్‌లో రాజకుమారుడిలా కనిపించాడు.

రష్మిక ధరించిన నగలు

ఈ వేడుకలో రష్మిక ధరించిన నగలు కూడా ఎంతో ప్రత్యేకమైనవి. విజయ్ తల్లి తనకు కానుకగా ఇచ్చిన 'ది ఎటర్నల్ బ్లాసమ్' అనే హెయిర్‌లూమ్ నెక్లెస్‌ను రష్మిక ధరించింది. రోజ్ కట్ డైమండ్స్, బర్మీస్ కలర్ స్టోన్స్‌తో రూపొందించిన ఈ నెక్లెస్ ఆమె లుక్‌కు నిండుదనాన్ని ఇచ్చింది. శ్రీ జ్యువెలర్స్ వారు రష్మిక కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన మాంగ్ టిక్కా, గాజులు ఈ మెహందీ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

మెహందీ డిజైన్ విషయానికి వస్తే రష్మిక చాలా సింపుల్ అండ్ మీనింగ్‌ఫుల్ డిజైన్‌ను ఎంచుకుంది. తన అరచేతిలో ఓం, త్రిశూలం, తామర పువ్వులు, సూర్య చంద్రుల చిత్రాలను మెహందీగా వేయించుకుంది. బాలీవుడ్ కాపీ-పేస్ట్ ఫార్ములాకు దూరంగా, తమకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్‌ను క్రియేట్ చేసుకున్న ఈ జంట వెడ్డింగ్ ఫ్యాషన్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

Advertisment
తాజా కథనాలు