సామాన్యులతో నుంచి సెలెబ్రిటీల వరకు ప్రతీ ఒక్కరూ గత సంవత్సరానికి వీడ్కోలు పలికి, కొత్త ఏడాదిని ఆనందంగా ఆహ్వానించారు. పాత జ్ఞాపకాలను గుండెల్లో దాచుకుని, కొత్త సంవత్సరం తెచ్చే అనుభూతుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మన నేషనల్ క్రష్ రష్మిక కూడా తన లైఫ్ లో జరిగిన మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మికను..' మీ జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకం ఏది?' అని అడగ్గా.. దీనికి శ్రీవల్లి బదులిస్తూ.. తన జీవితంలో ముఖ్యమైన ఓ రోజును గుర్తు చేసుకుంది. ' 2016 డిసెంబర్ 30.. నా జీవితంలో ఎప్పటికీ ప్రత్యేకమైన రోజు. అప్పుడే నా తొలి సినిమా "కిరాక్ పార్టీ" విడుదలైంది. ఆ సినిమా నా జీవితం మొత్తం మార్చేసింది. Also Read : యూట్యూబ్ లో దుమ్ములేపుతున్న జాతర సాంగ్.. ఫుల్ వీడియో చూశారా? ఆ సినిమాతోనే నేను కన్నడ పరిశ్రమలో బిజీ అయ్యాను. ఇక, నా టాలీవుడ్ ఫస్ట్ మూవీ "చలో" అవకాశం కూడా "కిరాక్ పార్టీ" వల్లే వచ్చింది. ఆ సినిమా చూసి, నన్ను "చలో"లోకి ఎంపిక చేశారు. అప్పటి నుంచి నా కెరీర్ పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం అందరూ నన్ను "నేషనల్ క్రష్" అని పిలుస్తున్నారంటే, దానికి పునాది "కిరాక్ పార్టీ"నే.." అని తెలిపింది. ఇక గత నెలలో రిలీజైన 'పుష్ప2' తో మరో పాన్ ఇండియా సక్సెస్ ను సొంతం చేసుకుంది రష్మిక. సినిమాలో శ్రీవల్లీ పాత్రలో రష్మిక నటనకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. టాలీవుడ్ లో వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది. Also Read : అల్లు అర్జున్ అరెస్ట్ పై ఎట్టకేలకు నోరు విప్పిన జానీ మాస్టర్.. ఏం చెప్పారంటే?