/rtv/media/media_files/2025/03/18/vkvTL9GZiBFpfFAH75Fl.jpg)
Ranya Rao gold smuggling case
కన్నడ నటి రన్యారావు (Ranya Rao) గోల్డ్ స్మగ్లింగ్ కేసులో రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తోంది. తాజాగా తెలుగు నటుడు తరుణ్ రాజ్ కి కూడా ఆమె కేసులో సంబంధం ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. తరుణ్ రాజ్ బెంగళూరులోని ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందినవాడు. 2018లో 'పరిచయం' అనే తెలుగు చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు.
Also Read : కన్నప్ప నుంచి 'మహాదేవ శాస్త్రి' గర్జన.. మోహన్ బాబు ఇంట్రో సాంగ్!
దుబాయ్ కస్టమ్స్ ని మోసం చేసి..
అయితే రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ (DRI) ప్రకారం.. తరుణ్ రాజ్.. రన్యా రావు స్మగ్లింగ్ కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించినట్లు తేలింది. అతడు తన యూఎస్ పాస్‌పోర్ట్‌ను ఉపయోగించి దుబాయ్‌లో కస్టమ్స్ తనిఖీలను తప్పించుకొని రాణ్యా రావు బంగారాన్ని అనుమానం లేకుండా తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. రన్యారావు అరెస్టు అనంతరం ఆమె మొబైల్ ఫోన్, లాప్‌టాప్ పరీశీలించగా.. ఆమెకు తరుణ్ రాజ్ తో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఆధారాలతో కోర్టు అతడిని 5 రోజులపాటు DRI కస్టడీకి పంపింది.
Also Read : బైడెన్ పిల్లలకు సీక్రెట్ సర్వీస్ రక్షణను తొలగించిన ట్రంప్!
ఇది ఇలా ఉంటే ఇప్పటికే రన్యా రావును అదుపులోకి తీసుకున్న DRI అధికారులు ఆమెను ఇన్వెస్టిగేట్ చేయగా కీలక విషయాలు వెల్లడించినట్లు తెలిసింది. తాను గోల్డ్ స్మగ్లింగ్ (Gold Smuggling) చేసినట్లు అంగీకరించిందని, ఈ వ్యవహారంలో ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి పాత్ర కూడా ఉన్నట్లు రన్యా బయటపెట్టినట్లు సమాచారం. ఇదంతా కూడా అతని కోసమే చేసినట్లు కూడా చెప్పినట్లు తెలుస్తోంది. రన్యారావు 2024లోనే ఆమె 30 సార్లు దుబాయ్‌కు వెళ్లిందని, ఇటీవలే కేవలం 15 రోజుల్లో 4 సార్లు విదేశాలకు వెళ్లినట్లుగా గుర్తించారు. ప్రతి ట్రిప్‌లో కిలోల బంగారాన్ని అక్రమంగా రవాణా చేసినట్లు నిర్ధారించారు. స్మగ్లింగ్ చేసినందుకు ఒక ట్రిప్ కు రూ.12 లక్షలు తీసుకుంటుందని తెలిపారు.
Also Read : పట్టుదలకు చిరునామా, యువతకు స్ఫూర్తి సునీతా విలియమ్స్
Also Read : పెనుగంచిప్రోలు తిరుణాల్లలో ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్ల దాడి