/rtv/media/media_files/Ce63G0cHUcdkG0ggSXzl.jpg)
కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'దేవర' మూవీ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 27 న రిలీజైన ఈ సినిమా కేవలం 10 రోజుల్లోనే రూ.460 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ప్రస్తుతం దసరా హాలిడేస్ కావడంతో సినిమాకు మరింత ఆదరణ పెరిగింది.
ఇదిలా ఉంటే 'దేవర పార్ట్-2' పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా కొరటాల శివ ఆ అంచనాలను తన కామెంట్స్ తో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు. ఈ సీక్వెల్‌లో మరికొందరు బాలీవుడ్ స్టార్స్ ఉండే అవకాశం ఉందన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కొరటాల శివ మాట్లాడుతూ.." ఇది జరుగుతుందో, లేదో నాకు తెలియదు కానీ.. ‘దేవర2’లో రణ్‌వీర్ సింగ్, రణ్‌బీర్ కపూర్ ఉంటే బాగుంటుంది.
The MASS BREEZE - Director #KoratalaSiva shares his journey and everything about #Devara 🔥🔥
— NTR Arts (@NTRArtsOfficial) October 9, 2024
▶️ https://t.co/zFErlq96So
Don’t miss the chit chat! 💥💥#BlockbusterDevara pic.twitter.com/py5rXBXoVy
అతిథి పాత్రలు కూడా..
ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఇది జరుగుతుందో, లేదో తెలియకుండా నేను ఎక్కువ వివరాలు పంచుకోకూడదు. తెలుగు, తమిళ ఇండస్ట్రీలకు చెందిన నటీనటుల పేర్లు చెబితే ఇప్పటినుంచే ఊహాగానాలు మొదలవుతాయి. ‘దేవర2’లో అతిథి పాత్రలు కూడా ఉంటాయి. అవి సినిమాలో చాలా కీలకమైనవి. అతి త్వరలోనే వాటి వివరాలు ప్రకటిస్తాను" అని చెప్పుకొచ్చారు. ఆయన కామెంట్స్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా 2026 లో 'దేవర 2' ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read : ప్రాణాలకు తెగించిన యువకుడు.. తండ్రి, కూతురిని ఎలా కాపాడాడంటే?