Ram Charan: దేశాలు దాటిన రామ్ చరణ్ క్రేజ్.. 'గేమ్ ఛేంజర్' సాంగ్ కు కొరియన్స్ డ్యాన్స్

రామ్ చరణ్ క్రేజ్ ఏకంగా కొరియా వరకు చేరింది. తాజాగా కొరియన్ పాపులర్ సింగర్ పార్క్ మిన్ జున్ తన టీమ్ తో కలిసి 'గేమ్ ఛేంజర్' లోని రా మచ్చ రా మచ్చ.. సాంగ్ కి స్టెప్స్ వేసాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

New Update
hfcxcs

మన టాలీవుడ్ హీరోల క్రేజ్ దేశాలు దాటేస్తోంది. ముఖ్యంగా మెగా హీరో రామ్ చరణ్ కు 'RRR' మూవీతో విదేశాల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. సినిమాలో తారక్ తో కలిసి చరణ్ వేసిన నాటు నాటు స్టెప్స్ విదేశీయులను బాగా ఆకట్టుకుంది. అందుకే చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా మారాడు. జపాన్, రష్యా, చైనా లాంటి దేశాల్లో మన హీరోలకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఇక ఇప్పుడు రామ్ చరణ్ క్రేజ్ ఏకంగా కొరియా వరకు చేరింది.

Also Read : దేవిశ్రీ ప్రసాద్ పై మహేష్ ఫ్యాన్స్ ఫైర్.. నెట్టింట రచ్చ

'గేమ్ ఛేంజర్' నుంచి రీసెంట్ గా వచ్చిన 'రా..మచ్చ మచ్చ' అనే సాంగ్ ఫ్యాన్స్ తో పాటూ సినీ లవర్స్ ను ఎంతగానో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ప్రెజెంట్ ఫ్యాన్స్ అంత ఈ సాంగ్ తోనే వైబ్ అవుతున్నారు. తాజాగా కొరియన్ పాపులర్ సింగర్  పార్క్ మిన్ జున్ తన టీమ్ తో కలిసి గేమ్ ఛేంజర్ లోని రా మచ్చ రా మచ్చ.. సాంగ్ కి స్టెప్స్ వేసాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read : 'మెకానిక్ రాకీ' ట్రైలర్.. కామెడీ, లవ్, యాక్షన్ తో అదరగొట్టిన విశ్వక్ సేన్

రియల్ గ్లోబల్ స్టార్..

ముఖ్యంగా సాంగ్ లో చరణ్ వేసిన హుక్ స్టెప్స్ ను కొరియన్ టీమ్ చాలా స్టైలిష్ గా వేశారు. దీంతో ఈ వీడియో కాస్త నెటిజన్స్ ను ఆకట్టుకుంటుంది. మెగా ఫ్యాన్స్ అయితే ఈ వీడియో చూసి రామ్ చరణ్ నిజంగా గ్లోబల్ స్టార్ అని కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ కొరియన్ సింగర్ డ్యాన్స్ వీడియోని చరణ్ ఫ్యాన్స్ నెట్టింట షేర్ చేస్తున్నారు.  

సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'గేమ్ ఛేంజర్' పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కాబోతుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read :  తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. ఆ ఉద్యోగాలకు ఫ్రీగా కోచింగ్!

Also Read :  నాగ చైతన్య, శోభిత పెళ్లి సందడి షురూ.. వైరల్ అవుతున్న ఫొటోలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు