/rtv/media/media_files/2026/05/22/ram-charan-2026-05-22-07-16-50.jpg)
Ram Charan
Ram Charan: రామ్ చరణ్ రాజకీయాల్లోకి(Ram Charan Political Entry) వస్తారనే వార్తలు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అయితే ఈ ప్రచారాలపై తాజాగా రామ్ చరణ్ పూర్తి క్లారిటీ ఇచ్చారు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనే లేదని, ప్రస్తుతం తన మొత్తం దృష్టి సినిమాలపైనే ఉందని స్పష్టం చేశారు.
తన కొత్త పాన్ ఇండియా సినిమా పెద్ది Peddi ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చరణ్ ఈ విషయాలు వెల్లడించారు. అభిమానులు మిమ్మల్ని భవిష్యత్తులో సీఎం గా చూడాలని కోరుకుంటున్నారు అనే ప్రశ్నకు ఆయన ఆసక్తికరంగా స్పందించారు. “నేను రెండు పడవలపై ప్రయాణం చేయాలనుకోను. ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలు రెండూ కలిసి చేయడం నా స్టైల్ కాదు. ప్రస్తుతం నేను నటుడిగా ఇంకా మంచి స్థాయికి వెళ్లాలని మాత్రమే అనుకుంటున్నాను” అని చెప్పారు.
సినిమా ఇండస్ట్రీలో కొత్త కొత్త పాత్రలు చేయడం, ప్రేక్షకులకు గుర్తుండిపోయే సినిమాలు ఇవ్వడమే తన లక్ష్యమని రామ్ చరణ్ తెలిపారు. రాజకీయ వార్తల్లో ఎలాంటి నిజం లేదని కూడా క్లియర్ చేశారు.
ఇక ‘పెద్ది’ సినిమా గురించి కూడా ఆయన పలు విషయాలు చెప్పారు. ఈ సినిమా గ్రామీణ క్రీడల నేపథ్యంతో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా అని తెలిపారు. పల్లెటూరి యువకుడు ‘పెద్ది’ జీవితం చుట్టూ కథ తిరుగుతుందని, ఇందులో చాలా పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తానని చెప్పారు. ఈ పాత్ర కోసం శారీరకంగానే కాదు, మానసికంగా కూడా చాలా కష్టపడ్డానని వెల్లడించారు.
ఈ సినిమాకు దర్శకుడు బుచ్చిబాబు సాన Buchi Babu Sana. ఆయన దర్శకత్వంలో సినిమా చాలా నేచురల్‌గా వచ్చిందని చరణ్ అన్నారు. సినిమా తప్పకుండా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు.
ఈ సినిమా కోసం తాను మూడు రకాల బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్స్ చేయాల్సి వచ్చిందని రామ్ చరణ్ తెలిపారు. మొదట క్రికెటర్ లుక్ కోసం సన్నగా మారాల్సి వచ్చిందని చెప్పారు. ఆ తర్వాత కబడ్డీ ప్లేయర్ పాత్ర కోసం బలమైన శరీరాకృతి తెచ్చుకోవాల్సి వచ్చిందన్నారు. చివరగా రెజ్లర్ లుక్ కోసం మరింత భారీగా మారాల్సి వచ్చిందని తెలిపారు. ఇలా తక్కువ సమయంలో వరుసగా శరీరాన్ని మార్చుకోవడం చాలా కష్టంగా అనిపించిందని చెప్పారు.
అయితే తాను ఇష్టపడే పని కావడంతో ఆ కష్టం కూడా ఆనందంగా అనిపించిందని చరణ్ చెప్పారు. షూటింగ్ పూర్తయ్యాక ఇప్పుడు శరీరంలో నొప్పులు బయటపడుతున్నాయని తెలిపారు. రెజ్లింగ్ సన్నివేశాల సమయంలో చేతికి ఎక్కువ ఒత్తిడి రావడంతో ఇప్పుడు తన కూతురిని ఎత్తుకోవడానికీ నొప్పిగా ఉంటోందని చెప్పారు. త్వరలో ఎక్స్‌రే కూడా చేయించుకోవాల్సి ఉందని వెల్లడించారు.
యాక్షన్ సీన్స్ విషయంలో కూడా రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సాధ్యమైనంత వరకు డూప్ లేకుండా తానే స్టంట్స్ చేయడానికి ఇష్టపడతానన్నారు. దీనికి తన తండ్రి చిరంజీవినే Chiranjeevi ప్రధాన స్ఫూర్తి అని చెప్పారు. 70 ఏళ్లు దాటినా చిరంజీవి ఇంకా స్వయంగా యాక్షన్ సీన్స్ చేయడం తనకు ప్రేరణ ఇస్తుందని తెలిపారు. హీరోలు నిజంగా కష్టపడి చేసిన స్టంట్స్ ప్రేక్షకులకు థియేటర్లలో మరింత బాగా కనెక్ట్ అవుతాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ‘పెద్ది’ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
Follow Us