Rakul Preet Singh: టాలీవుడ్ హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెరీర్ ప్రారంభంలోనే తెలుగు సినీ ఇండస్ట్రీలో పలు సినిమాలు చేసి, ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అందాల భామ, స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు పొందింది.
రకుల్ తన సినీ ప్రస్థానాన్ని వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ చిత్రంతో మొదలుపెట్టింది. హీరో సందీప్ కిషన్‌తో కలిసి నటించిన ఈ చిత్రం ఆమెకు మంచి పేరు తెచ్చింది. తర్వాత, డైలాగ్ కింగ్ సాయి కుమార్ తనయుడు ఆది సాయికుమార్‌తో రఫ్ సినిమాలో నటించింది. ప్రారంభంలో చిన్న హీరోలతో నటించినా, చాలా త్వరగా టాప్ హీరోల సరసన నటించే అవకాశాలు దక్కించుకుంది.
Also Read: USA: అమెరికాలో విద్యార్థుల విలవిల..క్యాంపస్ లో మాత్రమే ఉద్యోగాలతో ఇబ్బందులు
సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రామ్ పోతినేని వంటి ప్రముఖ హీరోల సరసన వరుసగా సినిమాలు చేస్తూ టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఎదిగింది.
Also Read: USA: ట్రాఫిక్ కంట్రోల్ టవర్ లో సిబ్బంది కొరత...వాషింగ్టన్ ప్రమాదానికి కారణం ఇదే..
తాజాగా, నార్త్ ఇండియా ప్రముఖ వ్యాపారవేత్త విక్కీ భగ్నానీతో వివాహం చేసుకుని, తమ కొత్త జీవితం ఆనందంగా గడుపుతున్నారు. భర్తతో కలిసి ఫొటోలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంది రకుల్.
Also Read: పెళ్లి ఆగింది.. ఉద్యోగం పోయింది.. సైఫ్ కేసులో అమాయకుడి జీవితం నాశనం!
"హాట్ చాక్లెట్ ఎవరికీ కావాలి?"
తాజాగా, ఈ బ్యూటీ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక స్పెషల్ పోస్ట్ షేర్ చేసింది. "హాట్ చాక్లెట్ ఎవరికీ కావాలి?" అనే క్యాప్షన్‌తో, చేతిలో చాక్లెట్ గ్లాస్ పట్టుకుని దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. టైర్ పగిలి పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు!